Multibagger Stock alert : రూ. 10వేలతో రూ. 53లక్షల లాభం! ఏడాదిలో ఈ స్టాక్‌తో 53000శాతం రిటర్నులు..
06 October 2024, 7:08 IST
- multibagger stocks for 2024 : శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చింది. దీంతో పొజిషనల్ ఇన్వెస్టర్లకు రూ.10,000 పెట్టుబడిపై రూ.53 లక్షల రాబడి వచ్చింది!
ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌తో భారీ రిటర్నులు
స్టాక్ మార్కెట్లో గత ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన స్టాక్స్ ఎన్నో ఉన్నాయి! వాటిల్లో శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ ఒకటి. ఈ స్టాక్ అద్భుతమైన రాబడులను ఇచ్చింది. ఏడాది కాలంలో కంపెనీ షేరు ధర 53000 శాతానికి పైగా పెరిగింది!
శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్..
శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ షేరు ధర 5 అక్టోబర్ 2023న బీఎస్ఈలో రూ .1.73 గా ఉంది. కాగా 2024 అక్టోబర్ 4, శుక్రవారం నాడు బీఎస్ఈలో 2 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.922.25 స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఒక్క ఏడాదిలోనే 53000 శాతం లాభాన్ని చూశారు!
అక్టోబర్ 5, 2023 నాటికి ఈ కంపెనీలో పెట్టుబడిదారుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 5780 షేర్లు వచ్చేవి. శుక్రవారం రూ.922.25 రేటుతో రాబడిని లెక్కగడితే, ఆ షేర్ల విలువ ఇప్పుడు రూ.53,30,605 అవుతుంది! అంటే కేవలం రూ.10,000 పెట్టుబడిపై పెట్టుబడిదారులకు రూ.53 లక్షల ప్రయోజనం లభించినట్టు!
అయితే మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో రివార్డుతో పాటు రిస్క్ కూడా అదే విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఫండమెంటల్స్‌ని పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:- Multibagger stock alert : రూ. 55 నుంచి రూ. 1886కి- రెండేళ్లల్లో 3330శాతం పెరిగిన స్టాక్!
శ్రీ అధికారి బ్రోదర్శన్ టెలివిజన్ నెట్ వర్క్ వాటాలను సెక్యూరిటీస్ టీ గ్రూపులో కలిగి ఉంది. అలాంటి షేర్లను బీఎస్ఈ ట్రేడ్-టు-ట్రేడ్‌లో ఉంచుతుంది. ఈ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఉద్దేశించినవి కావు.
సాబ్ టీవీలో కూడా ఈ సంస్థకు వాటా ఉంది. ఈ సంస్థ మస్తీ, దబాంగ్, ధమాల్ గుజరాత్ వంటి చానళ్లను నిర్వహిస్తోంది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం ఈ కంపెనీలో మొత్తం ప్రమోటర్ల వాటా 59.10 శాతం. మొత్తం ప్రజల వాటా 40.25 శాతం. జూన్ 2024 త్రైమాసికం నాటికి, కంపెనీలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల మొత్తం వాటా 0 శాతంగా ఉంది.
శ్రీ అధికారి బ్రదర్స షేర్ ప్రైజ్ హిస్టరీ..
5 రోజుల్లో ఈ శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ ధర 8శాతం పెరిగింది. నెల రోజుల్లో 45.5శాతం, 6 నెలల్లో 1,640శాతం వృద్ధి చెందింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27,100 శాతానికిపైగా వృద్ధిచెందింది.