Dividend stock : ఈ కంపెనీలో ఒక్క షేరు ఉంటే.. బ్యాంక్​లో రూ. 110 పడతాయి!-maharashtra scooters declares high dividend see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dividend Stock : ఈ కంపెనీలో ఒక్క షేరు ఉంటే.. బ్యాంక్​లో రూ. 110 పడతాయి!

Dividend stock : ఈ కంపెనీలో ఒక్క షేరు ఉంటే.. బ్యాంక్​లో రూ. 110 పడతాయి!

Sharath Chitturi HT Telugu
Sep 20, 2024 10:20 AM IST

High Dividend stock : మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేర్లు వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఎక్స్ డివిడెండ్ స్టాక్ గా ట్రేడ్ కానున్నాయి. ఈ సంస్థ.. ఒక్కో షేరుపై భారీ డివిడెండ్​ని ప్రకటించింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ హై డివిడెండ్​ స్టాక్​ గురించి మీకు తెలుసా?
ఈ హై డివిడెండ్​ స్టాక్​ గురించి మీకు తెలుసా?

హై డివిడెండ్​ స్టాక్స్​పై ఇన్​వెస్టర్ల ఫోకస్​ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది!ఈ నేపథ్యంలో మంచి డివిడెండ్ చెల్లించే కంపెనీల కోసం చూస్తున్న వారికి శుభవార్త. మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ బంపర్​ డివిడెండ్​ని ప్రకటించింది! ఒక్కో షేరుకు రూ.100కు పైగా డివిడెండ్​ని ప్రకటించింది. ఈ డివిడెండ్ కోసం కంపెనీ రికార్డు తేదీని కూడా వెల్లడించింది. ఈ కంపెనీ ఇస్తున్న డివిడెండ్​, రికార్డ్​ డేట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహారాష్ట్ర స్కూటర్స్​ లిమిటెడ్​ డివిడెండ్​..

షేరుపై రూ.110 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో మహారాష్ట్ర స్కూటర్స్​ లిమిటెడ్​ వెల్లడించింది. ఈ డివిడెండ్​కు సెప్టెంబర్ 25, బుధవారం రికార్డు తేదీగా నిర్ణయించింది. అంటే వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో ఎక్స్- డివిడెండ్ స్టాక్​గా ఈ కంపెనీ స్టాక్​ ట్రేడ్ కానుంది.

ఆ సమయానికి ముందు సంస్థ షేర్లు డీమ్యాట్​ అకౌంట్​లో ఉన్న వారికి.. కొన్ని రోజుల తర్వాత బ్యాంక్​ ఖాతాలో షేరుకు రూ. 110 చొప్పున డబ్బులు పడతాయి.

మహారాష్ట్ర స్కూటర్స్ సంస్థ రెగ్యులర్​గా డివిడెండ్లు ఇస్తూనే ఉంటోంది. 2024 జూన్ నెలలో ఎక్స్ డివిడెండ్ స్టాక్​గా ట్రేడ్ అయింది. ఆ తర్వాత కంపెనీ రూ.60 తుది డివిడెండ్ చెల్లించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 2 సార్లు రూ.170 డివిడెండ్​ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేసింది.

కాగా ఈ కంపెనీ ఒక్కసారి కూడా ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు ఇవ్వలేదు.

మహారాష్ట్ర స్కూటర్స్​ షేర్​ ప్రైజ్​ హిస్టరీ..

మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ గత ఏడాది కాలంగా మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ కాలంలో కంపెనీ షేరు ధరలు 59 శాతం పెరిగాయి. అదే సమయంలో 6 నెలల పాటు ఈ స్టాక్​ని కలిగి ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 76 శాతం లాభాన్ని చూసి ఉంటారు. ఇన్వెస్టర్ల కోణంలో మంచి విషయం ఏమిటంటే కేవలం ఒక్క నెలలోనే ఈ షేరు ధర 32 శాతం పెరిగింది! గురువారం మార్కెట్ ముగిసే సమయానికి మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేరు బీఎస్ఈలో 1.63 శాతం లాభంతో రూ.12057.65 వద్ద స్థిరపడింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లోనూ లాభాలతో 12,120 వద్ద ట్రేడ్​ అవుతోంది.

అయితే.. ఒక కంపెనీ స్టాక్​ కొనేందుకు కేవలం డివిడెండ్లు మాత్రమే ప్రామాణికం కాదని గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో డివిడెండ్​ అనేది స్టాక్​ ప్రైజ్​తో అడ్జెస్ట్​ అవుతుందని మదుపర్లు గమనించాలి.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం