High dividend stock : ఒక్క షేరుకు రూ. 410 డివిడెండ్- ఇన్వెస్టర్లకు పండగే!
అబాట్ ఇండియా భారీ డివిడెండ్‌ని ప్రకటించింది. ఒక షేరుపై కంపెనీ రూ.410 డివిడెండ్ చెల్లించనుంది. పూర్తి వివరాలు..
స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కి ఎంత డిమాండ్ ఉంటుందో, హై డివిడెండ్ స్టాక్స్‌కి కూడా అంతే డిమాండ్ కనిపిస్తుంటుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివెండ్స్ని రాబట్టేందుకు అనేకమంది ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ఇలాంటి ఇన్వెస్టర్స్‌కి బంపర్ న్యూస్! అబాట్ ఇండియా కంపెనీ, తమ ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్‌ని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హై డివిడెండ్ స్టాక్..
స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీలు వచ్చే వారం ఎక్స్డివిడెండ్ స్టాక్‌గా మారనున్నాయి. వాటిల్లో అబాట్ ఇండియా ఒకటి. ఒక్కో షేరుకు రూ.410 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది.
1 షేరుపై కంపెనీ రూ.410 డివిడెండ్ ఇస్తున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ఈ డివిడెండ్ కోసం జూలై 19ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే, ఆ రోజు, దానికి ముందు కంపెనీ రికార్డ్ బుక్‌లో పేరు ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే డివిడెండ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తుపెట్టుకోవాలి. జూలై 21న కంపెనీ ఎక్స్-డివిడెండ్ స్టాక్‌గా ట్రేడవుతుంది.
2023లో 2 సార్లు డివిడెండ్స్..
ఇన్వెస్టర్స్‌కి తరచూ డివిడెండ్స్ ఇచ్చే కంపెనీల్లో అబాట్ ఇండియా ఒకటి. 2023లో కంపెనీ రెండుసార్లు డివిడెండ్ ఇచ్చింది. కంపెనీ రూ.145 ప్రత్యేక డివిడెండ్ ఇచ్చింది. ఒక్కో షేరుకు రూ.180 తుది డివిడెండ్‌ను కంపెనీ చెల్లించింది. అబాట్ ఇండియా తొలిసారిగా 2001లో డివిడెండ్ చెల్లించింది. 2008 నుంచి కంపెనీ వరుసగా డివిడెండ్లను చెల్లిస్తూ వస్తోంది.
స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరు ఎలా ఉంది?
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అబాట్ ఇండియా షేరు ధర 1.23 శాతం పడి రూ.27,471.60 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో కంపెనీ షేరు ధర 17.9 శాతం పెరిగింది. అదే సమయంలో 6 నెలల పాటు ఈ స్టాక్‌ను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పటివరకు సుమారు 4 శాతం లాభాలు చూశారు. అయితే గత నెల రోజుల్లో ఈ షేరు 0.3 శాతం పడింది.
కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.29,638.15గా ఉంది. అబాట్ ఇండియా షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.22,000గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.58,396.48గా ఉంది. కంపెనీ ఒక్కసారి కూడా బోనస్ షేర్లు ఇవ్వలేదు.
అయితే కేవలం డివిడెండ్లను చూసే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం ఉత్తమం.)
సంబంధిత కథనం