Multibagger stock : రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్!
25 February 2023, 11:09 IST
- Multibagger stock : ప్రముఖ ఇన్వెస్టర్ మనీష్ గోయెల్ హోల్డ్ చేస్తున్న ఓ స్టాక్.. రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్!
Multibagger stock : స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం అని చాలా మంది నిపుణులు సూచిస్తూ ఉంటారు. ట్రేడింగ్‌లో నష్టాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. అందుకే.. ఒక స్టాక్ కొని, దీర్ఘకాలం దానిని హోల్డ్ చేస్తే, మంచి రిటర్నులు చూడవచ్చు. అనేక మంది దిగ్గజ ఇన్వెస్టర్లు కూడా చేసేది ఇదే. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. 30ఏళ్ల క్రితం కొన్న కోకాకోలా స్టాక్స్‌ని ఇంకా హోల్డ్ చేస్తున్నారు.
ఇక వాల్యూ ఇన్వెస్టర్ మనీష్ గోయెల్ ప్రకారం.. "సంపద సృష్టించుకునేందుకు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారంటే.. లాంగ్ టర్మ్ వాల్యూ ఇన్వెస్టింగ్తోనే అది సాధ్యపడుతుంది. అది కూడా.. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌తోనే సంపద సృష్టించుకోవచ్చు. అయితే.. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి, అండర్వాల్యూలో ఉన్న స్టాక్‌ను కనిపెట్టడమే చాలా కష్టమైన విషయం."
Multibagger stock news : ఒక స్టాక్‌ను ఎప్పుడు కొనాలి? ఎంత కాలం హోల్డ్ చేయాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మనీష్ గోయెల్.
"స్టాక్‌కు చెందిన ఫెయిర్ వాల్యూకు తగ్గట్టు పెట్టుబడులు చేయాలి. 52వీక్ లో, 52 వీక్ హై, స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ వంటి వాటిని పట్టించుకోకూడదు. ఫెయిర్ వాల్యూ కన్నా కింద స్టాక్ ప్రైజ్ ట్రేడ్ అవుతుంటే.. అప్పుడు కొనడం ఉత్తమం. ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువలో ట్రేడ్ అవుతుంటే, దానిని సెల్ చేయవచ్చు," అని మనీష్ గోయెల్ స్పష్టం చేశారు.
షేర్ వాల్యూ ఫెయిర్ ప్రైజ్‌లో ఉందన్నది ఎలా తెలుసుకోవాలి? అన్న విషయాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. మైథాన్ అలాయ్స్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ప్రస్తుతం లిస్ట్ అయ్యి ఉన్నాయి. 2008-09 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ స్టాక్ రూ. 17,50 వద్ద బాటమ్‌ను టచ్ చేసింది. ఇప్పుడు.. ఇదొక మల్టీబ్యాగర్ స్టాక్. ప్రస్తుతం బీఎస్ఈలో మైథాన్ అలాయ్స్ షేర్లు రూ. 918 వద్ద ఉంది.
మైథాన్ అలాయ్స్ షేర్ బోనస్ హిస్టరీ..
Maithan Alloys share price : దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడంతో అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బోనస్‌లను సంస్థలు ప్రకటిస్తూ ఉంటే.. స్టాక్ ధర పెరుగుతూ ఉంటుంది. 2010లో ఈ కెమికల్ స్టాక్ ఎక్స్- బోనస్ వద్ద ట్రేడ్ అయ్యింది. 2015లోనూ ఇదే జరిగింది. అంటే.. 2008- 2009లో ఈ స్టాక్‌ని కొనుగోలు చేసి ఉంటే, ఇప్పటికి రెండుసార్లు బోనస్‌లు పొంది ఉండొచ్చు. బీఎస్ఈ వెబ్సైట్ ప్రకారం.. 2010 జూన్ 17న బోనస్ షేర్లు 1:2 రేషియోలో ప్రకటించింది. అంటే.. 2 షేర్లు ఉన్న మదుపర్లకు అదనంగా మరో 1 షేరు వచ్చి చేరింది. ఇక 2015 జులై 15న.. 1:1 రేషియాలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే.. మైథాన్ అలాయ్స్ 1 షేరు ఉన్న మదుపర్లకు అదనంగా 1 షేరు వచ్చి చేరింది.
పెట్టుబడులపై ప్రభావం..
009లో రూ. 1లక్షను పెట్టుబడి పెట్టిన మదుపర్లకు 5,714 మైథాన్ అలాయ్స్ షేర్లు దక్కి ఉంటాయి. 2010లో 1:2 బోనస్ షేర్లు వచ్చినప్పుడు మొత్తం స్టాక్స్ 8,571కు చేరింది. ఆ తర్వాత 2015లో 1:1 బోనస్ ప్రకటించిన తర్వాత.. 8,571 షేర్లు కాస్తా 17,142కు చేరాయి.
రూ. 1లక్ష = రూ. 1.57కోట్లు
Maithan Alloys share price target : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో మైథాన్ అలాయ్స్ షేర్ ప్రైజ్ 918 వద్ద ఉంది. అంటే.. 14ఏళ్ల క్రితం రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1.57కోట్లకు చేరుతుంది. వీటిల్లో డివిడెండ్లు కూడా లేకపోవడం విశేషం.
(ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)