Ford Bronco SUV : తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!-huge demand for ford bronco suv carmaker ready to pay buyers to opt other vehicles ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Demand For Ford Bronco Suv, Carmaker Ready To Pay Buyers To Opt Other Vehicles

Ford Bronco SUV : తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 07:15 AM IST

Ford Bronco SUV : కార్ల వెయిటింగ్​ పీరియడ్​లు రోజురోజుకు పెరిగిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాము. కానీ.. ఓ ఎస్​యూవీకి వస్తున్న భారీ డిమాండ్​ను చూసి సంస్థ చేతులెత్తేసి, మరో మోడల్​ కొనుగోలు చేయాలని కస్టమర్లకు డబ్బులిస్తున్న సంస్థను చూడటం చాలా అరుదు. ఇప్పుడు ఇదే జరిగింది..!

తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!
తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!

Ford Bronco SUV : కొవిడ్​ సంక్షోభం కారణంగా.. వాహనాల డెలివరీలు చాలా ఆలస్యమవుతున్నాయి. కొన్ని కొన్ని మోడల్స్​కు నెలల తరబడి వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఇండియాలోనే కాకుండా.. అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఓ ఎస్​యూవీకి లభిస్తున్న భారీ డిమాండ్​ను చూసి ఓ ఆటో సంస్థ చేతులెత్తేసింది. వేరే మోడల్​ కొనుక్కోవాలని.. కస్టమర్లకు రివర్స్​లో డబ్బులిస్తోంది! అవును.. మీరు విన్నది నిజమే. ఆటో సంస్థ.. కస్టమర్లకు డబ్బును ఆఫర్​ చేస్తోంది. ఆ సంస్థ పేరు ఫోర్డ్​. అత్యంత డిమాండ్​, సుదీర్ఘ వెయిటింగ్​ పీరియడ్​ ఉన్న ఆ వెహికిల్ పేరు​.. “ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ”.

ట్రెండింగ్ వార్తలు

భారీ డిమాండ్​.. డెలివరీ డీలా..!

2020లో ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించింది కరోనా వైరస్​. దీని కారణంగా సప్లై చెయిన్​ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. అంతర్జాతీయంగా ఆటో పరిశ్రమపై దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్​లో 2021లో.. బ్రోంకో ఎస్​యూవీని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటో సంస్థ ఫోర్డ్​. ప్రొడక్షన్​ను వెంటనే ప్రారంభించి.. వాహనాలను డెలివరీ చేయగలమన్న నమ్మకంతో బుకింగ్స్​ను సైతం అప్పుడే మొదలుపెట్టింది. కానీ సీన్​ రివర్స్​ అయ్యింది!

Ford Bronco SUV waiting period : 2021లో ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీని లాంచ్​ చేయగా.. 2022 వరకు దీని ప్రొడక్షన్​ ప్రారంభం అవ్వలేదు. సప్లై చెయిన్​ వ్యవస్థ దారుణంగా దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా.. అటు కస్టమర్ల నుంచి బుకింగ్స్​ విపరీతంగా పెరిగిపోయాయి. ఇటు ప్రొడక్షన్​ ఆలస్యమైపోయింది. అధికారక లెక్కలను సంస్థ వెల్లడించలేదు కానీ.. అమెరికాలో ఈ ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీకి 2లక్షలకుపైగా బుకింగ్స్​ వచ్చినట్టు సమాచారం. కొందరికి వాహనాలు అందినా.. చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ ఎస్​యూవీకి నెలల తరబడి వెయిటింగ్​ పీరియడ్​ ఉంది.

వేరే కారు కొంటే.. కస్టమర్లకు రూ. 2లక్షలు!

Ford Bronco SUV price in India : ఈ పరిస్థితులతో ఫోర్డ్​ సంస్థ చేతులెత్తేసింది. బ్రోంకో ఎస్​యూవీని డెలివరీ చేయలేమని కస్టమర్లకు చెప్పేసింది. వేరే వాహనాలను కొనుగోలు చేస్తే డబ్బులిస్తామని స్పష్టం చేసింది. రిపోర్టుల ప్రకారం.. ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ బుకింగ్స్​ రద్దు చేసుకుని, తమ సంస్థకు చెందిన ఇతర మోడల్స్​ను కొనుగోలు చేసే వారికి 2,500 డాలర్లు ఇస్తామని చెబుతోంది. ఇండియా కరెన్సీలో ఆ విలువ రూ. 2,02,400! మేవరిక్​, ముస్తాంగ్​, ఎఫ్​-150 ట్రెమర్​ వంటి మోడల్స్​పై ఈ ఆఫర్​ ఇస్తోంది.

Ford Bronco SUV latest news : ఇక ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ విషయానికొస్తే.. 2021లో లాంచ్​ అయిన ఈ మోడల్​లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 2 డోర్​ వేరియంట్​. ఇంకోటి 4 డోర్​ 4X4 వేరియంట్​. అమెరికా మార్కెట్​లో జీప్​ వ్రాంగ్లర్​కు ఈ 4X4 ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ గట్టి పోటీనిస్తోంది. ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ హై ఎండ్​ మోడల్​లో.. క్రూయిజ్​ కంట్రోల్​, 10 స్పీకర్​ బీ అండ్​ ఓ సౌండ్​ సిస్టెమ్​, ఇంటిగ్రేటెడ్​ నేవిగేషన్​ అండ్​ బాడీ కలర్డ్​ హార్డ్​టాపస్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. కస్టమైజ్​ చేసుకునే ఆప్షన్​ కూడా ఇచ్చింది ఫోర్డ్​.

WhatsApp channel

సంబంధిత కథనం