Motorola Edge 50 vs Realme 13 Pro : రూ. 30వేల బడ్జెట్- ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
02 August 2024, 13:40 IST
Motorola Edge 50 : మోటరోలా ఎడ్జ్ 50 వర్సెస్ రియల్మీ 13 ప్రో.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
మోటోరోలా- రియల్మీ తమ కొత్త తరం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేశాయి. రియల్మీ 13 ప్రో దాని కెమెరా, ఏఐ ఫీచర్లకు ప్రాచుర్యం పొందుతుండగా, మోటోరోలా ఎడ్జ్ 50 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కారణంగా దాని మన్నికకు ప్రశంసలు అందుకుంటోంది. మోటోరోలా ఎడ్జ్ 50- రియల్మీ 13 ప్రో రూ .30000 లోపు ధర శ్రేణిని కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని పోల్చి, ఏది బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకుందాము..
మోటaరోలా ఎడ్జ్ 50 వర్సెస్ రియల్మీ 13 ప్రో:
డిజైన్: మోటోరోలా ఎడ్జ్ 50 కంపెనీ సిగ్నేచర్ డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 ప్రొటెక్షన్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది. రియల్మీ 13 ప్రో ఐపీ65 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కొత్త డిజైన్ని కలిగి ఉంది. మోటోరోలా డివైజ్ ఎక్కువ మన్నికను అందిస్తుండగా, రియల్ మీ 13 ప్రో డిజైన్ కోణంలో మరింత ఆకర్షణీయంగా, ప్రీమియంగా కనిపిస్తుంది.
డిస్ప్లే: మోటోరోలా ఎడ్జ్ 50లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67 ఇంచ్ పీఓఎల్ఈడీ 1.5కే కర్వ్డ్ డిస్ప్లే ఉంది. రియల్మీ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంది.
పర్ఫార్మెన్స్: సమర్థవంతమైన మల్టీటాస్కింగ్, పనితీరు కోసం మోటోరోలా ఎడ్జ్ 50లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. రియల్మీ 13 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ సోనీ-లైటియా 700సీ మెయిన్ కెమెరా సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో కూడిన 10 ఎంపీ టెలిఫోటో లెన్స్ వంటి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు రియల్మీ 13 ప్రోలో హైపర్ఇమేజ్+ ఆర్కిటెక్చర్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. రెండు స్మార్ట్ఫోన్లు 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉన్నాయి.
బ్యాటరీ: మోటోరోలా ఎడ్జ్ 50 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే రియల్మీ 13 ప్రో 45 వాట్ ఛార్జింగ్‌ను అందించే 5200 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ధర పరంగా చూస్తే మోటోరోలా ఎడ్జ్ 50 ధర రూ.27,999గా ఉంది. రియల్మీ 13 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.26,999.
మరో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.