Budget friendly smartphones : రూ. 10వేల బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవి బెస్ట్!
తక్కువ ధరకే ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? జూలై 2024 లో రూ .10,000 లోపు కొనుగోలు చేయడానికి బెస్ట్ గ్యాడ్జెట్స్‌ని ఇక్కడ చూసేయండి..
మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఐక్యూ, పోకో, రెడ్మీ వంటి పాపులర్ బ్రాండ్లతో కూడిన రూ.10,000 లోపు ధరతో ఉన్న టాప్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ఇక్కడ చూసేయండి..
రూ.10,000లోపు బెస్ట్ ఫోన్లు: ఐక్యూ జెడ్9 లైట్ 5జీ:
ఐక్యూ జెడ్9 లైట్ లో 6.56 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి మాలి జీ57 ఎంసీ 2 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్‌ని ఇందులో అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేసే ఈ ఫోన్‌కు 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి. జెడ్9 లైట్ 5జీలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ ఉన్నాయి.
కెమెరా ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ ఉన్నాయి. సెఫ్లీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ షూటర్ కూడా ఉంది.
పోకో ఎం6 ప్రో 5జీ:
పోకో ఎం6 ప్రో 5జీలో 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రాసెసర్‌ను అందించారు. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ ఓసీ ప్రాసెసర్ దీని సొంతం. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.2 మేజర్ ఓఎస్ అప్ డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది.
పోకో ఎం6 ప్రో 5జీ వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా డిస్ప్లే పై భాగంలో హోల్ పంచ్ కట్ అవుట్లో ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఉపయోగపడుతుంది.
మోటో జీ24 పవర్:
గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం మాలి జీ-52 ఎంపీ2 జీపీయూతో జత చేసిన మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై మోటో జీ24 పవర్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌తో లభిస్తుంది.
6.56 ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ వంటివి ఈ బడ్జెట్ స్మార్ట్ఫ్ఫోన్ ప్రత్యేకతలు. ఇందులో ముందు భాగంలో పంచ్ హోల్ నాచ్ డిజైన్ కలిగి ఉంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 52 సర్టిఫికేషన్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే, మోటో జీ24 పవర్ వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, మాక్రో షాట్స్ తీయడానికి 2 మెగాపిక్సెల్ సెన్సార్. సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలన్నింటినీ నిర్వహించడానికి ఈ స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ సెన్సార్ కూడా ఉంది.
4. రియల్మీ సీ53:
రియల్మీ సీ53 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 90.3 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. స్క్రీన్ 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. ఏఆర్ఎం మాలి-జీ57 జీపీయూ, 12ఎన్ఎం, 1.82గిగాహెర్ట్జ్ సీపీయూతో ఆక్టాకోర్ చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
రియల్మీ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది. 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరా, 1080 పి / 30 ఎఫ్పిఎస్, 720 పి / 30 ఎఫ్పిఎస్స, 480 పి / 30 ఎఫ్పిఎస్ వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రియల్మీ సీ53లో 8 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 720 పి / 30 ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వీడియో, పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్డీఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్, బోకే ఎఫెక్ట్ కంట్రోల్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
5. రెడ్మీ 13సీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ అవసరాలను తీర్చడానికి మాలి-జీ57 ఎంపీ 2 జీపీయూతో కనెక్ట్ చేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జి 85 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే, రెడ్మీ 13సీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వినియోగదారుల సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
సంబంధిత కథనం