Motorola Edge 50: స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్ తో భారత్ లో మోటరోలా ఎడ్జ్ 50 లాంచ్; ధర ఎంతంటే..?
Motorola Edge 50 launch: మోటరోలా మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. రూ. 27,999 ధరలో, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్ తో ఈ మోటరోలా ఎడ్జ్ 50 లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
Motorola Edge 50 launch: మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ లో భాగంగా వస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 అల్ట్రా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇతర ఎడ్జ్ 50 ఫోన్స్ తరహా డిజైన్ నే కలిగి ఉంది. అయితే, మోటరోలా ఎడ్జ్ 50 కుటుంబంలోని ఇతర స్మార్ట్ ఫోన్ ల మాదిరిగా కాకుండా ఎడ్జ్ 50 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది.
మోటరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 19000 వరకు పీక్ బ్రైట్ నెస్ ఉన్న 6.67 అంగుళాల పోలెడ్ 1.5 కే డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఇది స్క్రాచ్, ఇంపాక్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మోటరోలా వేపర్ కూలింగ్ సిస్టమ్ తో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఎడ్జ్ 50 పనిచేయనుంది. మోటోరోలా 2 సంవత్సరాల మేజర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లను కూడా అందిస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 50 కెమెరా సెటప్
మోటరోలా ఎడ్జ్ 50 (Motorola Edge 50) లో సోనీ-లిటియా 700 సీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో కూడిన 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా ఇందులో అందించారు. 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ (Smart phone) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
మూడు రంగుల్లో..
మోటరోలా ఎడ్జ్ 50 (Motorola Edge 50) మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. అవి జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్, కోలా గ్రే. గ్రీన్, పీచ్ వేరియంట్ లకు వేగన్ లెదర్ బ్యాక్ ను అందిస్తున్నారు. గ్రే కలర్ ఆప్షన్ వేరియంట్ కు వేగన్ స్యూయెడ్ బ్యాక్ ఉంటుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
మోటరోలా ఎడ్జ్ 50 ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్తో లాంచ్ అయింది. అది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ స్టోరేజ్ వేరియంట్. మోటరోలా ఎడ్జ్ 50 ధర రూ.27,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 8, 2024 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి రానుంది. కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలను ఉపయోగించి రూ .2000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.