Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు
Motorola Edge 50 Fusion: ఎడ్జ్ 50 ఫ్యూజన్ ను మోటరోలా భారత మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో, ఆకట్టుకునే లుక్ తో, అందుబాటు ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను మోటరోలా తీసుకువచ్చింది. ఇందులో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.
Motorola Edge 50 Fusion launch: మోటోరోలా తన ఎడ్జ్ 50 సిరీస్ కు తాజాగా అదనంగా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ను తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ మోడల్ ను మే 16న భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ పోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ ప్లే ను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ వోసీ ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ తో వస్తోంది.
సోనీ సెన్సార్ తో కెమెరా
సోనీ లైటియా ఎల్ వైటీ-700సీ సెన్సార్, ఓఐఎస్ తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని ఉపయోగించే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ డివైస్ కు మూడు ఓఎస్ అప్ డేట్ లను అందించడానికి మోటరోలా కట్టుబడి ఉంది.
విస్తృత కలర్ ఆప్షన్స్
హాట్ పింక్ లేదా మార్ష్ మల్లో బ్లూ వీగన్ లెదర్ ఆప్షన్లలో ఇది (Motorola Edge 50 Fusion) అందుబాటులో ఉంది. అలాగే స్లీక్ ఫారెస్ట్ బ్లూ మెటీరియల్ తో ఈ ఎడ్జ్ 50 ఫ్యూజన్ వస్తోంది. ఇందులో ఐపి 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సేఫ్టీతో వస్తోంది. 68వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల (2400×1080 పిక్సెల్స్) ఎఫ్ హెచ్ డీ+ 10 బిట్ ఓఎల్ ఈడీ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ ప్లే ఉంది. Motorola Edge 50 Fusion హెచ్ డీఆర్ 10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 4ఎన్ఎం మొబైల్ ప్లాట్ ఫామ్ పై అడ్రినో 710 జీపీయూతో పనిచేస్తుంది. 8 జీబీ లేదా 12 జీబీ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు 256 జీబీ లేదా 512 జీబీ యూఎఫ్ఎస్ 2.2.
డాల్బీ అట్మాస్ తో స్టీరియో స్పీకర్లు
ఆండ్రాయిడ్ 14తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో + నానో)ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ ఆడియో, డాల్బీ అట్మాస్ తో స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే, 5 జీ ఎస్ఎ / ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4 జి వోల్టే, వై-ఫై 6 (2.4 గిగాహెర్ట్జ్ / 5 గిగాహెర్ట్జ్), బ్లూటూత్ 5.2, జిపిఎస్, యుఎస్బి టైప్-సి, ఎన్ఎఫ్సి ఉన్నాయి. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్: ధర, లభ్యత
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వెర్షన్ ధర రూ. 22,999గా నిర్ణయించారు. 12 జీబీ + 256 జీబీ వెర్షన్ ధర రూ .24,999గా నిర్ణయించారు. మే 22 నుంచి ఫ్లిప్ కార్ట్, మోటరోలా అధికారిక వెబ్ సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ .2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.