Boat Ear buds : బోట్ కొత్త ఇయర్‌బడ్స్ రూ.999 మాత్రమే.. బ్యాటరీ లైఫ్ 35 గంటలు
Boat Earbuds : చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటే వచ్చే మజానే వేరు. అలాంటివారికోసం బోట్ కొత్త ఇయర్ బడ్స్ తీసుకొచ్చింది. దీని బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వస్తుంది.
ఈ కాలంలో ఇయర్ బడ్స్ ట్రెండ్‌గా మారింది. దాదాపు అందరూ ఇయర్ బడ్స్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే కొత్తగా కొనాలి అనుకునేవారికోసం బోట్ తన కొత్త ఇయర్ బడ్స్‌గా బోట్ ఎయిర్ డోప్స్ ఆల్ఫా డెడ్ పూల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇయర్ బడ్స్‌లో 13 ఎంఎం డ్రైవర్‌ను అమర్చారు. ఇది బోట్ సిగ్నేచర్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
ఒరిజినల్ బోట్ ఎయిర్డోప్స్ ఆల్ఫా ఇయర్‌బడ్స్‌ను కంపెనీ గత ఏడాది లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ తన ప్రత్యేకమైన డెడ్‌పూల్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. దీని ధర, ఆఫర్, స్పెషాలిటీ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎయిర్డోప్స్ ఆల్ఫా డెడ్‌పూల్ ఎడిషన్ డిజైన్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఇయర్‌బడ్స్ కస్టమ్ బాక్స్‌లో వస్తాయి. ముందు భాగంలో డెడ్‌పూల్, వోల్వరైన్, వెనుక భాగంలో డెడ్‌పూల్ చిత్రం ఉంటుంది. ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ కూడా ఉంది. స్పెషల్ ఎడిషన్ ఇయర్‌బడ్స్ ఎరుపు, నలుపు రంగులలో వస్తాయి. ఒక ఇయర్‌బడ్‌పై డెడ్‌పూల్ చిహ్నం, మరొకదానిపై బోట్ లోగో ఉన్నాయి.
మంచి ధ్వని కోసం ఈ ఇయర్‌బడ్స్ 13 మిమీ డ్రైవర్‌ను కలిగి ఉంటాయి. ఇది బోట్ సిగ్నేచర్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇయర్ బడ్స్ మొత్తం 35 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది.
ఇది ఫాస్ట్ ఛార్జింగ్(ఎఎస్ఎపీటీఎమ్ ఛార్జ్ టెక్నాలజీ)కు మద్దతును కలిగి ఉంది. ఇయర్‌బడ్స్ కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 60 నిమిషాల ప్లే బ్యాక్ అందిస్తుంది. క్లియర్ కాల్స్ కోసం ఈఎన్ఎక్స్టీఎం టెక్నాలజీతో డ్యూయల్ మైక్రోఫోన్లు, స్థిరమైన కనెక్షన్ల కోసం బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, మెరుగైన గేమింగ్ అనుభవం కోసం 50 ఎంఎంలో లేటెన్సీ, బీస్ట్ మోడ్ ఉన్నాయి.
బోట్ ఎయిర్డోప్స్ ఆల్ఫా డెడ్‌పూల్ ఎడిషన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,099, బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.999గా ఉంది.