TWS Earbuds: 54 గంటల ప్లేబ్యాక్ టైమ్‌తో బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ఇయర్‌బడ్స్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే
boAt Airdopes Genesis TWS Earbuds: బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. జూన్ 1న సేల్ మొదలవుతుంది. ఈ బడ్స్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇవే.
boAt Airdopes Genesis TWS Earbuds: ఎయిర్‌డోప్స్ లైనప్‌లో దేశీయ బ్రాండ్ బోట్ మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ తీసుకొచ్చింది. బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ మోడల్‌ను లాంచ్ చేసింది. డిజైన్ పరంగా కాస్త విభిన్నంగా ఉన్న చార్జింగ్ కేస్‌తో ఈ బడ్స్ అడుగుపెట్టాయి. మెటల్ ఫినిష్, కాంపాక్ట్ డిజైన్‌తో ఇన్నాయి. కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉండేందుకు బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్ నాలుగు మైక్‌లను కలిగి ఉన్నాయి. బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ వివరాలు ఇవే.
బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
13mm సౌండ్ డ్రైవర్లు ఈ బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్‌లో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో ఈ బడ్స్ వచ్చాయి. క్లియర్ కాలింగ్ కోసం ENx టెక్నాలజీతో కూడిన నాలుగు మైక్‌లు ఈ బడ్స్‌కు ఉంటాయి.
బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ఒక్కో బడ్లో 35mAh బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ కేస్‌లో 400mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా ఈ బడ్స్ 54 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తాయి. 5 నిమిషాల చార్జింగ్తోనే 60 నిమిషాలు ఉపయోగించుకునేలా ఏఎస్ఎఏపీ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంటుంది.
టచ్ కంట్రోల్స్‌తో బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్ వచ్చాయి. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ ఉంది. వాయిస్ అసిస్టెంట్లకు ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయి. ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. అంటే చెవిలో నుంచి బడ్ బయటికి తీస్తే మ్యూజిక్ ఆటోమేటిక్‌గా పాస్ అవుతుంది. ఇక గేమింగ్ కోసం 60ms లో ల్యాటెన్సీ ఉంటుంది.
బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ధర, సేల్ డేట్
బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.1,799గా ఉంది. జూన్ 1వ తేదీన అమెజాన్, బోట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ బడ్స్ సేల్కు వస్తాయి. యాక్టివ్ బ్లాక్, వైట్ ప్యూరిటీ, ఓసియానా కలర్ ఆప్షన్లలో ఈ బడ్స్ అందుబాటులోకి వస్తాయి.
కాగా, బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ కూడా రీసెంట్గా లాంచ్ అయ్యాయి. దీని ధర రూ.1,499గా ఉంది. 10mm సౌండ్ డ్రైవర్లు, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఈ ఇయర్‌ఫోన్స్ వచ్చాయి. కాల్ క్లారిటీ కోసం ENX టెక్నాలజీ ఇచ్చినట్టు బోట్ పేర్కొంది. 10 నిమిషాల చార్జింగ్తోనే 10 గంటల ప్లేబ్యాక్ ఇచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని కూడా ఈ నయా నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ కలిగి ఉన్నాయి.
టాపిక్