Luxury Watches Smuggling : లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు, మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ నోటీసులు-hyderabad luxury watches smuggling case chennai customs notices to minister ponguleti son harsha reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Luxury Watches Smuggling : లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు, మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ నోటీసులు

Luxury Watches Smuggling : లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు, మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ నోటీసులు

Bandaru Satyaprasad HT Telugu
Apr 07, 2024 05:11 PM IST

Luxury Watches Smuggling : లగ్జరీ వాచీ ల స్మగ్లింక్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీచేశారు.

లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు
లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు

Luxury Watches Smuggling : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కుమారుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్(chenani Customs) అధికారులు నోటీసులు జారీచేశారు. లగ్జరీ వాచీల స్మగ్లింగ్‌(Luxury Watches Smuggling) ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపారు. అయితే కస్టమ్స్ అధికారులు ముందు ఈ నెల 4న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 3న కస్టమ్స్ కు పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి లేఖ రాశారు. తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు.

లగ్జరీ వాచీల కేసు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి(Harsha Reddy) అక్రమంగా తరలిస్తున్న లగ్జరీ వాచీలను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై చెన్నై కస్టమ్స్‌(Chennai Customs) సమన్లు​జారీ చేసింది. ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఓ భారతీయుడి నుంచి రూ.1.73 కోట్ల విలువైన లగ్జరీ వాచీ లను ఎయిర్ పోర్టులో కస్టమ్స్(Customs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టోకరెన్సీ, హవాలా లావాదేవీలను ఉపయోగించి నవీన్ కుమార్ అనే మధ్యవర్తి ద్వారా హర్షరెడ్డి ఒక లగ్జరీ వాచీ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిరాధార ఆరోపణలు

సింగపూర్(Singapore) నుంచి చెన్నై(Chennai)కి ముబీన్ అనే వ్యక్తి లగ్జరీ వాచీ‌(Luxury Watches)లను స్మగ్లింగ్(Smuggling) చేశాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ముబీన్ తెచ్చిన వాచీలను మధ్యవర్తి నవీన్‌ కుమార్‌ ద్వారా హర్షరెడ్డి(Ponguleti Harsha Reddy) కొనుగోలు చేసినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొంగులేటి హర్షరెడ్డి తెలిపారు. వాచీ ల తరలింపులో తన ప్రమేయంలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ముహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు లగ్జరీ వాచీలు-పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. రూ.100 కోట్లకు పైగా స్మగ్లింగ్ జరగవచ్చని కోర్టు భావించడంతో స్మగ్లర్ నవీన్ కుమార్ ముందస్తు బెయిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. హర్ష రెడ్డి ప్రమేయంపై తదుపరి విచారణ జరిపి నవీన్‌ కుమార్‌ను అరెస్టు చేయాలని ఆలందూరు కోర్టు పోలీసులను ఆదేశించింది.

IPL_Entry_Point