Aston Martin DB12 : సూపర్ లగ్జరీ ఆస్టన్ మార్టిన్ డీబీ12ని.. గతేడాది ఇండియాలో లాంచ్ చేసింది బ్రిటీష్‌కి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక ఇప్పుడు ఈ వెహికిల్ డెలివరీని మొదలుపెట్టింది. ఇండియాలో.. తొలి ఆస్టన్ మార్టిన్ డీబీ12ని కొన్నారు.. జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్. ఇండియాలో.. ఆస్టన్ మార్టిన్ డీబీ12 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ.4.59 కోట్లుగా ఉంది.
ఆస్టన్ మార్టిన్ డీబీ12.. ఒక బ్రిటిష్ గ్రాండ్ టూరర్. మెర్సిడెస్-ఏఎంజీలోని 4.0-లీటర్ ట్విన్-టర్బో వీ 8 ఇంజిన్.. ఈ లగ్జరీ కారులో ఉంటుంది. ఇది.. 671 బీహెచ్పీ పవర్‌ని, 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో.. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది.. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం.. 3.5 సెకన్లలో అందుకుంటుంది. అయితే.. టాప్ స్పీడ్ మాత్రం 325 కేఎంపీహెచ్కి లిమిట్ చేయడం జరిగింది.
Aston Martin DB12 price in India : ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12.. డీబీ11కి సక్సెసర్‌గా వస్తోంది. 80 శాతం కొత్తది. భారీ కొత్త గ్రిల్, త్రీ-పీస్ డీఆర్ఎల్ యూనిట్‌తో రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, మరింత అగ్రెసివ్ లుక్ కోసం షార్ప్ స్టైల్ బంపర్ సహా ప్రధాన డిజైన్ మార్పును ఈ కొత్త కారులో చూడొచ్చు. చూడంగానే.. ఇది ఆస్టన్ మార్టిన్ కారు అని చెప్పేసే విధంగా.. ఈ వెహికిల్ ఉంటుంది.
కొత్త డ్యూయెల్-టోన్ లెథర్ అప్‌హోలిస్ట్రీ, డాష్‌బోర్డ్ సహా డీబీ11తో పోల్చుకుంటే.. కొత్త కారు కేబిన్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, అన్ని అవసరమైన కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్ల హోస్ట్ ఉంది. అయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇప్పుడు డిజిటల్‌గా కూడా ఉంది. కొత్త డీబీ12 గ్రాండ్ టూరర్ కాబట్టి, సౌకర్యానికి అధిక ప్రాధాన్యత ఉంది. స్పోర్ట్స్ కారు రైడ్ నాణ్యతలో లోపం లేకుండా హ్యాండ్లింగ్‌ని ఆప్టిమైజ్ చేయడం కోస ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్, అడాప్టివ్ డాంపర్లతో వస్తుంది.
జొమాటో సీఈఓ గోయల్ గ్యారేజ్‌లో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఫెరారీ రోమా, లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫాంటే, పోర్షే 911 టర్బో ఎస్, ఆస్టన్ మార్టిన్ డీబీ11 ఏఎంఆర్, మెర్సిడెస్-ఏఎంజీ జీ 63, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటివి కొన్ని ఉదాహరణలు.
సంబంధిత కథనం