Motorola Edge 50 Neo : లాంచ్‌కి ముందే మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫీచర్స్ లీక్..
Motorola Edge 50 Neo price : విడుదలకు ముందు, రాబోయే మోటోరోలా ఎడ్జ్ 50 నియో డిజైన్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 50 నియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, కొత్త మోడల్ డిజైన్, ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్ 50 నియో గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మోటోరోలా ఎడ్జ్ 50 నియో: డిస్ప్లే..
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచ్ ఓపీఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్క్రీన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌ను అందించే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఇది వివిధ పనులకు సమతుల్య పనితీరును అందించే సమర్థవంతమైన ప్రాసెసర్.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో: కెమెరా, బ్యాటరీ..
ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ సెన్సార్లు, విభిన్న ఫోటోగ్రాఫిక్ అవసరాలను తీరుస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రోజంతా పనిచేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో: డిజైన్ అండ్ బిల్డ్..
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై పనిచేస్తుంది. 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఇది ఐపీ68 రేటింగ్‌ని కలిగి ఉంది. ఇది వాటర్-డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ పరికరం మందం 8.1 ఎంఎం, బరువు 171 గ్రాములు, ఇది సొగసైన, తేలికపాటి డిజైన్ని సూచిస్తుంది. వెనుక భాగంలో వెజిటేరియన్ లెథర్ ఫినిష్ గురించి ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వెనుక భాగంలో పాంటోన్ లేబుల్ ఉండటం డిజైన్‌కు స్టైల్ టచ్‌ను జోడిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌గా రూపుదిద్దుకుంటోంది. పనితీరు, డిజైన్ని మిళితం చేస్తుంది. సెప్టెంబర్ 2023లో కంపెనీ ఎడ్జ్ 40 నియోను విడుదల చేసింది. ఇది ఎడ్జ్ 50 నియో కోసం ఇలాంటి లాంచ్ టైమ్‌లైన్‌ని సూచిస్తుంది. ధర, లభ్యత వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, త్వరలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో మన హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
సంబంధిత కథనం