తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Middle Class Savings : మిడిల్ క్లాస్ వాళ్లు కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిన 2 స్కీమ్స్.. సేఫ్టీతోపాటు మంచి రిటర్న్స్!

Middle Class Savings : మిడిల్ క్లాస్ వాళ్లు కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిన 2 స్కీమ్స్.. సేఫ్టీతోపాటు మంచి రిటర్న్స్!

Anand Sai HT Telugu

28 November 2024, 8:00 IST

google News
    • Middle Class Savings Scheme : మిడిల్ క్లాస్ వారు దేనిలోనైనా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు. కారణం అవి తిరిగి వస్తాయో రావోననే అనుమానం. కొన్ని స్కీమ్స్ సురక్షితంగా ఉంటాయి. మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. మధ్యతరగతి వారికి బెస్ట్.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మధ్యతరగతి ప్రజలు కచ్చితంగా కొన్ని పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలి. ఇందులో ప్రభుత్వం పెట్టుబడిదారులకు 8.2 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి, ఇంకొటి సుకన్య సమృద్ధి యోజన (SSY). మధ్యతరగతి ప్రజలు సహజంగా పెట్టుబడి పెట్టడానికి బాగా ప్రాచుర్యం పొందిన రెండు పథకాలు ఇవి. ఈ రెండు పథకాలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీములు, ఈ చిన్న పొదుపు పథకాలు మీకు సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. ఈ పథకాల ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.

మీరు ఈ చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకాలు విభిన్న వడ్డీ రేట్లను అందిస్తాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఈ పథకాలు సురక్షితమైన సేవింగ్ స్కీమ్స్ కోసం వెతుకుతున్న పెట్టుబడిదారుల కోసం బెటర్ ఆప్షన్. మరో ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ రెండు పొదుపు పథకాలు మధ్యతరగతి ప్రజలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తును కాపాడేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా సుకన్య సమృద్ధి ఖాతా పథకం ప్రస్తుత డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఖాతా ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే గరిష్ట డిపాజిట్ వ్యవధి 15 సంవత్సరాలు మాత్రమే. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఒక్కో అమ్మాయికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. అదే సమయంలో ఒక కుటుంబం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు. మధ్యతరగతివారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఉద్యోగుల్లో ఆదరణ పొందిన ఈ పథకంలో మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్ మీకు సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అదే సమయంలో మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు ఈ పథకంలో పెట్టుబడిని రూ.500 నుండి ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఈ మొత్తంపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. మీరు పీపీఎఫ్‌లో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీరు దానిని 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య వంటి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఇప్పుడు వచ్చే త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి వరకు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటు నిర్ణయం డిసెంబర్ చివరి వారంలో తీసుకుంటారు.

తదుపరి వ్యాసం