MG Windsor EV Booking : ఎంజీ విండ్సర్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్లు
03 October 2024, 11:00 IST
MG Windsor EV Booking : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ బుకింగ్స్ మెుదలు అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు మంచి రేంజ్‌తోపాటుగా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. టాటా మోటార్స్ తరువాత దేశంలో రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల విక్రయదారు అయిన ఎంజీ మోటార్స్.. విండ్సర్ ఈవీని బుకింగ్ చేయడం ప్రారంభించింది. కంపెనీ అక్టోబర్ 3 ఉదయం 7:30 గంటలకు ఎంజీ విండ్సర్ ఈవీ కోసం బుకింగ్‌లను మెుదలుపెట్టింది.
అక్టోబర్ 3 నుంచి జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా షో రూమ్‌ల్లో టోకెన్ అమౌంట్‌గా రూ.11,000 చెల్లించి విండ్సర్ ఈవీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ కారు డెలివరీలు అక్టోబర్ 12న ప్రారంభమవుతాయి. ఎంజీ విండ్సర్ ఈవీని బుక్ చేసేందుకు కస్టమర్లు తమ సమీప డీలర్షిప్‌ను కూడా సందర్శించవచ్చు. లేదంటే బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఎంజీ విండ్సర్ ఈవీ ఫీచర్లు, పవర్ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం. పవర్ట్రెయిన్ విషయానికొస్తే.. ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 136 బిహెచ్పీ శక్తిని, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ విండ్సర్ ఈవీ 4 డ్రైవింగ్ మోడ్స్ (ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్)లో వస్తుంది. నివేదికల ప్రకారం ఈ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. భారత మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు, సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ .13.50 లక్షలుగా ఉంది.
మరోవైపు ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, వైర్లెస్ ఫోన్ మిర్రరింగ్, 360 డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్, 8.8 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
ఫీచర్లలో ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్, ఇంటీరియర్ లోపల యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్ పై అమర్చిన మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం ఎంజీ విండ్సర్‌లో లెవల్ -2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్ ను అమర్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్లు ఉన్నాయి.