MG Windsor EV price : సింగిల్​ ఛార్జ్​తో 330 కి.మీ రేంజ్​- ఎంజీ విండ్సర్​ ఈవీ వేరియంట్ల ధరలు ఇవే..-mg windsor ev full prices revealed starts from 13 50 lakh with fixed battery ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Windsor Ev Price : సింగిల్​ ఛార్జ్​తో 330 కి.మీ రేంజ్​- ఎంజీ విండ్సర్​ ఈవీ వేరియంట్ల ధరలు ఇవే..

MG Windsor EV price : సింగిల్​ ఛార్జ్​తో 330 కి.మీ రేంజ్​- ఎంజీ విండ్సర్​ ఈవీ వేరియంట్ల ధరలు ఇవే..

Sharath Chitturi HT Telugu
Sep 22, 2024 10:28 AM IST

కొత్త ఎంజీ విండ్సర్​ ఈవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. మూడు వేరియంట్లు, వాటి ధరల గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్​  ఈవీ
ఎంజీ విండ్సర్​ ఈవీ

ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో విండ్సర్​ ఈవీని ఇటీవలే లాంచ్​ చేసింది ఎంజీ మోటార్​. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడ్డాయి. ఎంజీ విండ్సర్​ ఈవీ ధర రూ .13.50 లక్షల నుంచి ప్రారంభమై రూ .15.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఎక్స్-షోరూమ్ ధరల్లో బ్యాటరీ ఖర్చు కూడా ఉంది. అందుకే బేస్ వేరియంట్​ ఎగ్జైట్​ ధర రూ .13.50 లక్షల వద్ద ఉంది బ్యాటరీని రెంట్​కి తీసుకునే ఆప్షన్​తో పోలిస్తే ఫిక్స్​డ్​ బ్యాటరీ ఎగ్జైట్​ వేరియంట్​ ధర రూ .3.5 లక్షలు అధికం. అదే రెంటల్​ ఆప్షన్​లో వేరియంట్​కు రూ .10 లక్షలు, కిలోమీటరుకు రూ .3.5 ని సంస్థ వసూలు చేస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ వేరియంట్స్

జేఎస్​డబ్లూ- ఎంజీ మోటార్ ఇండియా భాగస్వామ్యంతో ఈ మోడల్​ని రూపొందించిన విషయం తెలిసిందే. కొత్త విండ్సర్ ఈవీ సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్) గా గుర్తింపు పొందింది. ఇది సెడాన్ సౌకర్యాన్ని, ఎస్​యూవీ స్పేస్​ని తీసుకువస్తుంది. ఎగ్జైట్, ఎక్స్​క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో ఈ సరికొత్త విండ్స్​ ఈవీ అందుబాటులో ఉంది.

  • ఎంజీ విండ్సర్ ఈవీ బేస్-స్పెక్ వేరియంట్ ఎగ్జైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.13.50 లక్షలు.
  • ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్​క్లూజివ్ వేరియంట్ ఎక్స్​షోరూ ధర రూ.14.50 లక్షలు.
  • ఎంజీ విండ్సర్ ఈవీ టాప్​ ఎండ్​ వేరియంట్​ ఎసెన్స్ ఎక్స్​షోరూం ధర రూ.15.50 లక్షలు.

ధరల ప్రకటన గురించి జెఎస్​డబ్ల్యు- ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సతీందర్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. “ఎంజీ విండ్సర్ వినియోగదారులు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ధర కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అప్​గ్రేడ్​ అవ్వొచ్చు. ఇది మరింత మంది సంభావ్య వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది. గ్రీన్​ ఎనర్జీ భవిష్యత్తుకు పరివర్తనకు శక్తినిస్తుంది, ” అని అన్నారు.

ఎంజీ విండ్సర్ ఈవీ ఫీచర్లు..

ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్​తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, విశాలమైన గ్లాస్ రూఫ్, టాప్ ట్రిమ్​లో 135 డిగ్రీల వరకు ఏరో లాంజ్ సీట్ల ఆప్షన్​ ఇందులో ఉన్నాయి. స్టార్బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే నాలుగు రంగుల్లో విండ్సర్ లభిస్తుంది.  

ఎంజీ విండ్సర్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 134బీహెచ్​పీ పవర్, 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్లను పొందుతుంది.

జెఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా కూడా మూడేళ్ల తర్వాత 60 శాతం బైబ్యాక్ మరియు విండ్సర్ ఈవీపై 45,000 కిలోమీటర్ల బైబ్యాక్​ని అందిస్తోంది. మొదటి కొనుగోలుదారుకు జీవితకాల బ్యాటరీ వారంటీ ఉంది. ఇంకా వాహన తయారీదారు ఎంజీ యాప్ ద్వారా ఈహబ్ కింద పబ్లిక్ ఛార్జర్లలో విండ్సర్ ఈవీకి మొదటి సంవత్సరం ఉచిత ఛార్జింగ్​ని అందిస్తోంది.

సంబంధిత కథనం