Electric Cycles : టాటా నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..-tata stryder launches voltic x and voltic go electric cycles with 40km range know price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Cycles : టాటా నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

Electric Cycles : టాటా నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

Anand Sai HT Telugu
Sep 18, 2024 02:07 PM IST

Electric Cycles : ఎలక్ట్రిక్ మెుబిలిటీ ట్రెండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు రకరకాలుగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నాయి. అంతేకాదు మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా వస్తున్నాయి. తాజాగా మరో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది టాటా కంపెనీ.

వోల్టిక్ ఎక్స్
వోల్టిక్ ఎక్స్

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా డిమాండ్ ఎక్కువే ఉంది. దీంతో కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారుచేస్తున్నాయి. ఇప్పటికే టాటా స్ట్రైడర్ కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా మరో రెండింటిని లాంచ్ చేసింది. 'వోల్టిక్ ఎక్స్', 'వోల్టిక్ గో' అనే రెండు కొత్త ఈ సైకిళ్లను విడుదల చేసింది.

వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న కారణంగా వినియోగదారుల మంచి ఎంపిక కోసం ఈ సైకిళ్లను ప్రారంభించినట్లు టాటా స్ట్రైడర్ తెలిపింది. వీటి ధర చూస్తే.. వోల్టిక్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 32,495గా ఉంది. వోల్టిక్ గో రూ. 31,495 నిర్ణయించారు. అసలు ధరపై 16 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

వోల్టిక్ X, వోల్టిక్ GO ఎలక్ట్రిక్ సైకిళ్లు 48V అధిక సామర్థ్యం, స్ప్లాష్ ప్రూఫ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో వస్తాయి. ఈ రెండింటిని కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ. నడపవచ్చని కంపెనీ వెల్లడించింది.

వోల్టిక్ గో సౌకర్యం, సౌలభ్యాన్ని కోరుకునే రైడర్‌ల కోసం తయారు చేశారు. దీని స్టెప్-డౌన్ ఫ్రేమ్ డిజైన్ మహిళా రైడర్‌లను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు వోల్టిక్ X ఎలక్ట్రిక్ సైకిళ్లు పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న కొండల మీదకు ఎక్కేలా.. సస్పెన్షన్ ఫోర్క్‌తో రూపొందించారు.

రెండు మోడల్స్ బ్యాటరీపై రెండేళ్ల వారంటీతో వస్తాయి. మెరుగైన భద్రత కోసం ఆటోమేటిక్ పవర్ కట్-ఆఫ్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

స్ట్రైడర్ సైకిల్ కంపెనీ టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (TIL) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. 2012లో ప్రారంభమైనప్పటి నుండి స్ట్రైడర్ భారతదేశం అంతటా 4,000 స్టోర్‌లకు పైగా తెరిచింది. ఇతర దేశాల్లోనూ దీనికి ఎగుమతులు ఉన్నాయి. అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్ నాణ్యతలాగే మంచి ఆవిష్కరణలతో స్ట్రైడర్ సైకిళ్లను అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎంటీబీ, జూనియర్, లేడీస్, రోడ్‌స్టర్ సైకిళ్లతో సహా అనేక రకాల సైకిళ్లను విక్రయిస్తుంది.

'భారతదేశంలో ఈ-సైకిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో మంచి పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మేం ముందుంటాం. ఈ సైకిళ్లకు ప్రజాదరణ పెరుగుతోంది. ఇవి సాంప్రదాయ సైక్లింగ్ అనుభవానికి అత్యంత సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా ప్రత్యామ్నాయం. మా కొత్త మోడల్స్ వోల్టిక్ X, వోల్టిక్ GO పట్టణ ప్రయాణ అవసరాలకు సరిపోతాయి.' అని స్ట్రైడర్ బిజినెస్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.

టాపిక్