MG Comet EV bookings : ఎంజీ కామెట్ ఈవీ కొంటున్నారా? ఇలా బుక్ చేసుకోండి..
15 May 2023, 16:36 IST
- MG Comet EV bookings : ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఈవీని ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ షురూ..
MG Comet EV bookings : దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో ఎంజీ కామెట్ ఈవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవీకి సర్వత్రా మంచి రివ్యూలు లభిస్తున్నాయి. ఇక ఇప్పుడు కామెట్ ఈవీ బుకింగ్స్‌ను ప్రారంభించింది ఎంజీ మోటార్. దేశంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో రిజర్వ్ చేసుకోవచ్చు.
గత నెలలో ఎంజీ కామెట్ ఫీచర్స్, ధరను రివీల్ చేసింది సంస్థ. ఈ ఈవీ ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.98లక్షలుగా ఉంది. ఈ ఈవీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి పేస్, ప్లే, ప్లష్. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.98లక్షలుగా ఉంది.
MG Comet EV on road price Hyderabad : తొలి 5వేల బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఇంట్రొడక్టరీ ప్రైజ్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. అందుకే.. ఆసక్తి ఉన్న వారు ఈ ఈవీని వెంటనే బుక్ చేసుకోవాలి. సంస్థ అధికారి వెబ్సైట్ లేదా సమీప డీలర్షిప్ షోరూమ్‌లో ఈ ఎంజీ కామెట్ ఈవీని బుక్ చేసుకోవచ్చు. 5వేల బుకింగ్స్ తర్వాత ఈ ఈవీ ధర కచ్చితంగా పెరుగుతుంది! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. టియాగో ఈవీతోనూ ఇదే చేసింది. తొలుత ఇంట్రొడక్టరీ ప్రైజ్‌ను ప్రకటించింది. అనంతరం వాహన ధరలను దాదాపు రూ. 70వేల వరకు పెంచింది.
ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోండి..
స్టెప్ 1:- ముందుగా ఎంజీ మోటార్ ఇండియా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లిండి.
స్టెప్ 2:- 'ఈ బుక్ యువర్ ఎంజీ' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
How to book MG Comet EV :స్టెప్ 3:- మీకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4:- టోకెన్ అమౌంట్‌ను ఆన్లైన్లో పే చేయండి.
ఇదీ చదవండి:- MG comet EV vs Citroen eC3 : ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3.. ఏది బెస్ట్?
కామెట్ ఈవీని బుక్ చేసుకున్న వారు తమ బుకింగ్స్‌ను ట్రాక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది ఎంజీ మోటార్. ఇందుకోసం.. మైఎంజీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ట్రాక్ అండ్ ట్రేస్ ఫీచర్‌ను చూస్తూ ఉండాలి. రియల్‌టైమ్ అప్డేట్స్ ఇస్తామని సంస్థ చెబుతోంది. మేన్యుఫ్యాక్చరింగ్ దశ నుంచి డీలర్షిప్ షోరూమ్ దశ వరకు అన్ని అప్డేట్స్ ఇస్తామని స్పష్టం చేసింది.
తాజాగా బుకింగ్స్ మొదలవ్వగా.. డెలివరీ ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ చెబుతోంది.
ఎంజీ కామెట్ ఈవీ విశేషాలు..
ఎంజీ కామెట్ ఈవీలో 17.3 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిపై గరిష్ఠంగా 8ఏళ్లు లేదా 1.20లక్షల కి.మీల వారెంటీ లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఈవీ 230కి.మీ దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో ఎలక్ట్రిక్ ఇంజిన్ 41 హెచ్‌పీ పవర్‌ను, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఈవీ స్పీడ్ 100కేఎంపీహెచ్. ఈకో, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఎంజీ కామెట్ ఈవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.