Affordable electric cars in India : ఈ ‘ఈవీ’ల ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ!
16 October 2022, 14:03 IST
- Affordable electric cars in India : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఆటో సంస్థల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతున్నాయి. దేశంలో సెఫ్టీ ఎక్కువగా ఉండి, తక్కువ ధరకే లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను ఓసారి చూద్దాం..
సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
Affordable electric cars in India : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఇంత కాలం ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నారు. కానీ దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు అంటే.. ఒకప్పుడు 1,2 సంస్థలే తయారు చేసేవి. కానీ ఇప్పుడు ఆ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అనేక ఆటో సంస్థలు తయారీ షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆటో సంస్థల మధ్య తీవ్ర పోటీ పెరిగింది. ఇలా పోటీ ఉండటం.. కస్టమర్లకు ఒకింత మంచి విషయమే! పోటీ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగొస్తున్నాయి. సరసమైన ధరల్లో, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి ఆటో సంస్థలు.
ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల ధరలతో పాటు సెఫ్టీ ఫీచర్స్‌ని కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. కారు భద్రతా ప్రమాణాలు కూడా కీలకమే కదా. అందువల్ల.. దేశంలో అధిక సెఫ్టీతో పాటు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల లిస్ట్‌ను ఓసారి చూద్దాం.
టాటా టిగోర్ ఈవీ..
Tata Tigor EV : దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది టాటా టిగోర్ ఈవీ. గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీలో ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ లభించింది. 2021 ఆగస్టులో దీనిని టెస్ట్ చేశారు. 17 పాయింట్లకు(అడల్ట్ ప్రొటెక్షన్) గాను 12 పాయింట్లు దక్కించుకుంది టాటా టిగోర్ ఈవీ. ఇక చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో 49పాయింట్లకు గాను 37.24పాయింట్లు సంపాదించుకుంది.
ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, స్టాండర్డ్ సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్స్ ఉన్నాయి. దేశంలో టాటా టిగోర్ ఈవీ ఎక్స్ షోరూం ధర రూ. 12.24లక్షలుగా ఉంది.
బీవైడీ అట్టో 3..
BYD Atto 3 : ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టింది బీవైడీ అట్టో 3. యూరో ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ చైనీస్ ఈవీ వాహనానికి 4 స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 91శాతం, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 89శాతం మార్కులు ఇది దక్కించుకుంది.
యూరో ఎన్సీఏపీ టెస్ట్‌లో వినియోగించిన బీవైడీ అట్టో 3 ఎలక్ట్రిక్ కారుకు డ్యూయెల్ ఫ్రెంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. బెల్ట్ ప్రీ టెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ ఎయిర్బ్యాక్స్ ఇందులో సెఫ్టీ ఫీచర్స్. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వాహనం ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. సరసమైన ధరల్లోనే ఇది లాంచ్ అవుతుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
హుండాయ్ కోనా ఈవీ.
Hyundai Kona Ev price : ఏఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో హుందాయ్ కోనా ఈవీ వాహనం 5 స్టార్ రేటింగ్‌ను సంపాదించుకుంది! కోనా ఈవీకి.. ఫ్రంటల్ ఆఫ్సెట్ ఇంపాక్ట్‌లో 37పాయింట్లకు గాను 35.07పాయింట్లు దక్కాయి. ఆస్ట్రేలియాలో ఈ టెస్ట్ నిర్వహించారు. హుందాయ్ కోనా ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 23.84లక్షలు- రూ. 24.03లక్షల మధ్యలో ఉంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ..
MG ZS EV : ఈ ఎలక్ట్రిక్ వాహనానికి యూరో ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 90శాతం, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 85శాతం మార్కులు ఇది సంపాదించుకుంది. ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ హెడ్ ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ రిమైండర్స్ వంటివి ఇందులో సేఫ్టీ ఫీచర్‌గా ఉంది. ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 22.58లక్షలు- 26.50లక్షల మధ్యలో ఉంది.
వీటితో పాటు టాటా టియాగో ఈవీ కూడా కొత్తగా లాంచ్ అయ్యింది. ఇండక్షన్ ప్రైజ్ కింద.. రూ. 9లక్షలోపే ఈ వాహనాన్ని కస్టమర్లకు ఇస్తున్నారు. 20వేల మందికి ఈ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత.. ఈ వాహనం ధర పెరిగే అవకాశం ఉంది.