తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy Ring : సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ ఫీచర్స్​ ఇవే..!

Samsung Galaxy Ring : సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ ఫీచర్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu

24 February 2024, 13:35 IST

  • Samsung Galaxy Ring price : సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​పై తాజాగా ఓ రిపోర్ట్​ బయటకి వచ్చింది. ఈ గ్యాడ్జెట్​ గురించి పలు ఆసక్తికర విషయాలు ఆ రిపోర్ట్​లో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ ఫీచర్స్​ ఇవే..!
సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ ఫీచర్స్​ ఇవే..! (Samsung)

సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ ఫీచర్స్​ ఇవే..!

Samsung Galaxy Ring launch date : సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​ గురించి మొదటి వార్త బయటకి వచ్చినప్పటి నుంచి ఈ గ్యాడ్జెట్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ రింగ్​కు సంబంధించి పెద్దగా వివరాలు తెలియకపోవడం, సంస్థ కూడా సీక్రెసీని మెయిన్​టైమ్​ చేస్తుండటంతో.. గెలాక్సీ రింగ్​పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు.. ఈ ఇన్నోవేటివ్​ గ్యాడ్జెట్​కి సంబంధించిన కొన్ని ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. వాటిని చూసేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్​- ఫీచర్స్​ ఇవేనా..?

కొరియన్​ సంస్థ 'ది ఎలెక్​' ప్రకారం.. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ ప్రస్తుతం ప్రోటోటైప్​ దశలో ఉంది. రెండో త్రైమాసికంలో దీని మాస్​ ప్రొడక్షన్​ ప్రారంభమవ్వొచ్చు. అంటే.. సుమారు ఇంకో నెల- నెలన్నర సమయం మాత్రమే ఉంది!

ది ఎలెక్​ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల్లో సామ్​సంగ్​ గెలాక్సీ అన్​ప్యాక్​డ్​ ఈవెంట్​ జరుగుతుంది. అందులో.. గెలాక్సీ జెడ్​ ఫోలడ్​ 6, ఫ్లిప్​ 6 స్మార్ట్​ఫోన్స్​ని సంస్థ లాంచ్​ చేస్తుంది. వాటితో పాటు.. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ కూడా లాంచ్​ అవుతుంది! జులై చివర్లో.. ఈ ఈవెంట్​ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అన్​ప్యాక్​డ్​ ఈవెంట్స్​.. సుమారు అదే సమయంలో జరిగాయి.

Samsung Galaxy Ring price in India : ఇక ఈ సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ గ్యాడ్జెట్​లో అదిరిపోయే, గ్రౌండ్​బ్రైకింగ్​ ఫీచర్స్​ ఉంటాయని టాక్​ నడుస్తోంది. ఈ వేరెబుల్​ గ్యాడ్జెట్​లో బ్లడ్​ ఫ్లో మెజరింగ్​ కెపబులిటీస్​ ఉంటాయట. హార్ట్​ రేట్​ మానిటరింగ్​ సిస్టెమ్​ ఎలాగూ ఉంటుంది! అయితే.. గుండె రిథమ్​ సరిగ్గా లేకపోతే, దానిని పసిగట్టేందుకు ఉపయోగపడే ఎలక్ట్రోకార్డియోగ్రామ్​ వంటి ఫీచర్స్​ ఈ డివైజ్​లో ఉంటాయని తెలుస్తోంది.

అంతేకాకుండా.. ఈ రింగ్​ కేవలం హెల్త్​ మానిటరింగ్​ ఒక్కటే కాకుండా ఇతర పనులు కూడా చేస్తుందట. ఈ రింగ్​తో వయర్​లెస్​ పేమెంట్స్​ చేయవచ్చని, ఇతర డివైజ్​లను కంట్రోల్​ చేయవచ్చని ది ఎలెక్​ చెబుతోంది. సామ్​సంగ్​ పే, సామ్​సంగ్​థింగ్స్​ వంటి ఇన్​హౌడ్​ సాఫ్ట్​వేర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ని ఈ రింగ్​ ద్వారా యాక్సెస్​ చేసుకోవచ్చు!

Samsung Galaxy Ring features : అయితే.. ఈ రింగ్​ యూజర్​ ఇంటర్​ఫేస్​ ఎలా ఉంటుంది? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అదే సమయంలో సామ్​సంగ్​ గెలాక్సీ ఏఐని ఈ రింగ్​లో సంస్థ వాడుతుందా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇన్ని కొత్త, క్రేజీ ఫీచర్స్​ ఉంటే.. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ ధర చాలా ఎక్కువగానే ఉండొచ్చని టాక్​ నడుస్తోంది.

ఏది ఏమైనా.. సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ గ్యాడ్జెట్​​ ఫంక్షనాలిటీపై అందరిలోను కుతుహలం నెలకొంది. ఇన్నోవేషన్​ని, యూజబులిటీని ఈ రింగ్​ ఎలా మేనేజ్​ చేస్తుంది? అన్నది అత్యంత ఆసక్తికర విషయంగా మారింది.

Samsung Galaxy Ring : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ రింగ్ ఫీచర్స్​, ధర, లాంచ్​ డేట్​పై త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. అఫీషియల్​ ప్రకటన వచ్చేంత వరకు.. సామ్​సంగ్​ లవర్స్​లో కచ్చితంగా ఆసక్తి పెరిగిపోతుంది!

తదుపరి వ్యాసం