Komaki Venice Eco| అగ్ని నిరోధక సాంకేతికతతో.. కొమాకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్, ధర కూడా తక్కువే!
06 October 2022, 19:35 IST
- జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కొమాకి నుంచి Komaki Venice Eco ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైంది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ లో మంచి టెక్నాలజీ అందిస్తున్నారు. ఇన్-బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ధర, ఇతర వివరాలు చూడండి.
Komaki Venice Eco electric scooter
జపనీస్ EV కంపెనీ Komaki ఇటీవల తమ బ్రాండ్ నుంచి Komaki Venice Eco పేరుతో ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ సరసమైన ధరలో, మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే దీని బ్యాటరీ అగ్ని నిరోధక సాంకేతికత (Fire-resistant Technology) తో వస్తుంది. కంపెనీ నుంచి ఈ టెక్నాలజీ కలిగిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. (Also Read ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలకుండా చిట్కాలు)
Komaki Venice Eco ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రత్యేకమైన లిథియం-అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీని అమర్చారు. సంప్రదాయ సాంకేతికత కలిగిన బ్యాటరీలతో పోలిస్తే ఐరన్ కంటెంట్ కలిగిన బ్యాటరీ మరింత సురక్షితమైన ఛాయిస్‌గా ఉంటుంది. ఇందులో బ్యాటరీలోని కణాల సంఖ్య 1/3వ వంతుకు తగ్గించడం ద్వారా వాహనం నడిపేటపుడు ఉత్పన్నమయ్యే వేడి తక్కువగా ఉంటుంది. ఈ బ్యాటరీలు 2500-3000 ఛార్జ్ సైకిళ్ల వరకు సురక్షితంగానే ఉంటాయి. అంతేకాకుండా బ్యాటరీ ఆరోగ్యం గురించి వినియోగదారులు, డీలర్‌లకు తెలియజేసే ఫూల్‌ప్రూఫ్ టెక్నాలజీని కూడా Komaki ఉపయోగించింది. భారతదేశంలో ఇలాంటి సాంకేతికత కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki Venice Eco మాత్రమే అని కంపెనీ పేర్కొంది.
Komaki Venice Eco Battery Details, Range- బ్యాటరీ సామర్థ్యం, పరిధి ఎంత?
కొమాకి వెనీస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో LiPO4 బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని 32 Amp హై-ఎఫిషియన్సీ కంట్రోలర్‌తో కూడిన మోటార్‌కు జత చేశారు. ఇది ఒక ఫుల్ ఛార్జింగ్‌పై సుమారు 85-100 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. సుమారు 3-4 గంటల వరకు బ్యాటరీ టైంను కలిగి ఉంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, టర్బో అనే 4 రైడ్ మోడ్‌లు ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ సెటప్ ఇచ్చారు.
Komaki Venice Eco Design, Features- ఫీచర్లు ఏం ఉన్నాయి?
కొమాకి వెనీస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్‌గా స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, సింగిల్-సీట్, బ్యాక్‌రెస్ట్ రెట్రో స్టైల్‌ను అందిస్తుంది. ఇది 6 విభిన్న రంగులయినటువంటి గార్నెట్ రెడ్, శాక్రమెంటో గ్రీన్, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, బ్రైట్ ఆరెంజ్, సిల్వర్ క్రోమ్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ EVలో అంతర్నిర్మిత మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఇంకా నావిగేషన్‌తో కూడిన అధునాతన TFT స్క్రీన్, ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, సెల్ఫ్ డయాగ్నోసిస్, రిపేర్ కోసం డెడికేటెడ్ బటన్ ఉన్నాయి.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన కొమాకి వెనీస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఎక్స్-షోరూమ్ వద్ద కేవలం రూ. 79,000/- మాత్రమే.