Seltos vs Creta vs Elevate : ఈ మూడు ఎస్‌యూవీల్లో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?
31 July 2024, 6:40 IST
- Best mileage SUV cars in india : కియా సెల్టోస్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా వర్సెస్ హోండా ఎలివేట్.. మైలేజ్ పరంగా ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
ది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హోండా ఎలివేట్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎస్యూవీ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి లిస్ట్‌లో ఈ మూడు వెహికిల్స్ కచ్చితంగా ఉంటున్నాయి. ఫీచర్స్ మాత్రమే కాదు మైలేజ్‌కి ప్రాధాన్యత ఇచ్చేవారు సైతం ఈ మూడు ఎస్‌యూవీలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైలేజ్ పరంగా ఈ మూడు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ చూద్దాము..
కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలు రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుండగా, హోండా ఎలివేట్ 1.5-లీటర్ 4 సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ని హోండా సిటీ నుంచి తీసుకోవడం జరిగింది. సెల్టోస్, క్రేటాలు గతేడాది అప్డేట్ అయ్యాయి. హోండా ఎలివేట్ చాలా కొత్త ఎస్యూవీ.
కియా సెల్టోస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా వర్సెస్ హోండా ఎలివేట్: ఇంజిన్..
కియా సెల్టోస్ 1.5-లీటర్ పెట్రోల్ మోటార్‌తో పాటు డీజిల్ ఇంజిన్ని కలిగి ఉంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. సెల్టోస్ గరిష్టంగా 113బీహెచ్పీ పవర్, 144ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హ్యుందాయ్ క్రెటాలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అదే పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యూవీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కియా సెల్టోస్ మాదిరిగానే ఉంటాయి.
ఇదీ చూడండి:- Cars to launch in August: టాటా కర్వ్ నుంచి థార్ రాక్స్ వరకు.. ఈ ఆగస్టులో లాంచ్ అవుతున్న 8 కార్లు ఇవే..
హోండా ఎలివేట్ ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 120 బీహెచ్పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కియా సెల్టోస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా వర్సెస్ హోండా ఎలివేట్: ఫ్యూయెల్ ఎకానమీ
కియా సెల్టోస్ పెట్రోల్ వేరియంట్ వివిధ ట్రాన్స్మిషన్-అమర్చిన వేరియంట్లను బట్టి లీటరుకు 17.7 కిలోమీటర్ల నుంచి 17.9 కిలోమీటర్ల మధ్య మైలేజ్ ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మోడల్.. వేరియంట్లను బట్టి లీటరుకు 17.4 కిలోమీటర్ల నుంచి 18.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక హోండా ఎలివేట్ ఎస్యూవీ వివిధ వేరియంట్లను బట్టి లీటరుకు 15.31 కిలోమీటర్ల నుంచి 16.92 కిలోమీటర్ల మధ్య మైలేజ్ ఇస్తుంది.
అంటే.. మైలేజ్ పరంగా కియా సెల్టోస్ బెస్ట్ అని స్పష్టమవుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ క్రేటా, హోండా ఎలివేట్లు ఉన్నాయి.
మరి ఈ మూడింట్లో మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారు?
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.