Exter vs Punch vs Fronx : ఈ మూడింట్లో.. అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ ఎస్యూవీ ఏది?
20 July 2024, 6:43 IST
Exter vs Punch vs Fronx CNG : ఎక్సటర్ సీఎన్జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్జీ వర్సెస్ ఫ్రాంక్స్ సీఎన్జీ.. మైలేజ్ పరంగా ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ ఎస్యూవీ ఏది?
దేశంలో సీఎన్జీ సెగ్మెంట్‌కి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా వినియోగదారులకు మంచి ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సీఎన్జీ, టాటా పంచ్ సీఎన్జీలకు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడింటినీ పోల్చి, మైలేజ్ పరంగా ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ: ఇంజిన్, మైలేజ్
హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీలో మొదటిసారిగా డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది సంస్థ. అన్ని ఇతర హ్యుందాయ్ సీఎన్జీ కార్లలో సింగిల్ సిలిండర్లే ఉన్నాయి. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేసిన అన్ని వేరియంట్లలో ఈ ఎస్యూవీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఎక్స్టర్ సీఎన్జీ వెర్షన్లు బై-ఫ్యూయల్ (పెట్రోల్ విత్ సిఎన్జి) ఇంజిన్ని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేస్తాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 68బిహెచ్పీ పవర్, 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 82 బిహెచ్పీ / 113 ఎన్ఎమ్ పెట్రోల్-ఓన్లీ వెర్షన్ల కంటే తక్కువ శక్తివంతమైనది.
మైలేజ్ పరంగా, హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ ఎస్యూవీ ఎఆర్ఎఐ గణాంకాల ప్రకారం కిలోకు 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఎస్ యూవీ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్ 19.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మారుతీ ఫ్రాంక్స్ సీఎన్జీ: ఇంజిన్, మైలేజ్
ఎక్స్టర్ మాదిరిగా కాకుండా, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీని రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందిస్తుంది. ఎస్యూవీ సీఎన్జీ వెర్షన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ కోసం, మారుతీ బై-ఫ్యూయల్ ఇంజిన్‌తో కనెక్ట్ చేసిన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందిస్తుంది. ఫ్రాంక్స్ సీఎన్జీ 76 బిహెచ్పీ పవర్‌ని, 98 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇది ఎక్స్టర్ కంటే ఎక్కువ శక్తివంతమైనది.
మారుతి ఫ్రాంక్స్ సీఎన్జీ ఎక్స్టర్ సీఎన్జీ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కిలోకు 28.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఓన్లీ వెర్షన్ మాన్యువల్ వేరియంట్లలో 21.79 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్లలో 22.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
టాటా పంచ్ సిఎన్జీ: ఇంజిన్, మైలేజ్
టాటా అతిచిన్న ఎస్యూవీ పంచ్, ప్రస్తుతం అమ్మకాల పరంగా భారతదేశంలోని అన్ని కార్లలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఎస్‌యూవీలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో కనెక్ట్ చేసి ఉంటుంది. 2023లో ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో టాటా మోటార్స్ మొదటిసారి మార్కెట్లో ప్రవేశపెట్టిన డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీని కూడా ఇది అందిస్తుంది. మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభించే పంచ్ సీఎన్జీ 72బిహెచ్పీ పవర్, 103ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ మూడు ప్రత్యర్థుల కంటే తక్కువ మైలేజీని అందిస్తుంది. ఈ ఎస్యూవీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఇంధన సామర్థ్యం కిలోకు 26.9 కిలోమీటర్లు. ఇది ఎక్స్టర్ సీఎన్జీ కంటే కొద్దిగా తక్కువ. పెట్రోల్-ఓన్లీ వెర్షన్ల మైలేజ్ లీటరుకు 19 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.