Kia K4 sedan : ఇదిగో.. సూపర్ స్టైలిష్ కియా కే4
23 March 2024, 6:18 IST
- Kia K4 sedan price : కియా కే4ని రివీల్ చేసింది కియా మోటార్స్. ఇదొక సెడాన్. డిజైన్ సూపర్ స్టైలిష్‌గా ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సూపర్ స్టైలిష్ కియా కే4 ఇదిగో..
Kia K4 sedan India launch : సెకెండ్ జనరేషన్ కియా కే4ని అంతర్జాతీయంగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. బ్రాండ్‌కి చెందిన కొత్త 'ఆపోజిట్ యునైటెడ్' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా దీనిని రూపొందించింది సంస్థ. టెక్నికల్ స్పెసిఫికేషన్లను కియా మోటార్స్ వెల్లడించలేదు. అయితే.. మార్చి 27న జరగనున్న న్యూయార్క్ ఆటో షోలో.. ఈ కియా కే4ని సంస్థ లాంచ్ చేయనుంది. అప్పుడు.. అన్ని వివరాలపై క్లారిటీ వస్తుంది.
ఇండియాలో కియా కే4 లాంచ్ కష్టమే..!
కియా కే4 ఇండియాలో లాంచ్ అవ్వకపోవచ్చు! ఇదొక సెడాన్ కావడమే ఇందుకు కారణం! ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ, ఎంపీవీ సెగ్మెంట్స్‌పై మాత్రమే సంస్థ ఫోకస్ చేసింది. ఇండియాలో సెడాన్ కన్నా వీటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది.
2025 కియా కే4 తయారీదారు నుంచి ఈవీ 9, ఈవీ 5, న్యూ జనరేషన్ కియా కార్నివాల్ వంటి సంస్థ లైన్ప్లో ఉన్నాయి. కియా క్యారెన్స్ ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Kia K4 sedan price in India : ఇక ఈ కియా కే4 ముందు భాగంలో డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన షార్ప్, ఎల్ ఆకారంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్‌ను భారీగా రీడిజైన్ చేసింది సంస్థ. ఇది మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది.
ఇక ఈ కొత్త సెడాన్ సైడ్స్‌లో రూఫ్ లైన్‌తో పొడవైన బానెట్‌ని కనిపిస్తోంది. కియా మరింత కూపే లాంటి లుక్ ఇవ్వడానికి వెనుక డోర్ హ్యాండిల్స్‌ను దాచింది. స్మార్ట్‌గా కనిపించే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెనుక చక్రాల పైన మస్క్యులర్ హాంచ్లు ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్-షేప్ టెయిల్ ల్యాంప్స్, పెద్ద గ్లాస్ ఏరియా ఉన్నాయి. మీడియం గ్రే, స్లేట్ గ్రీన్, కేనియన్ బ్రౌన్, ఓనిక్స్ బ్లాక్ రంగుల్లో కే4 లభిస్తుందని కియా తెలిపింది.
అట్రాక్టివ్‌గా.. ఇంటీరియర్!
Kia K4 sedan : ఇంటీరియర్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఊహించినట్లుగానే, ఒక పెద్ద యూనిట్ లాగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్ చేసిన ట్విన్ డిజిటల్ డిస్ప్లేలు ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కొత్తది, మల్టీ ఫంక్షనల్ యూనిట్. సెంటర్ కన్సోల్ కప్ హోల్డర్స్, గేర్ లివర్, యూఎస్బీ పోర్ట్స్ మినిమలిస్టిక్‌గా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నాలో మనం చూసినట్లుగా బ్లోయర్ కూడా ఒక స్లిమ్ హారిజాంటల్ యూనిట్.
అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న హోండా సివిక్, టయోటా కామ్రికి ఈ కియా కే4 గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Kia K4 sedan launch date : ఇక ఈ కియా కే4 సెడాన్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ఇతర ఫీచర్స్ తెలియాల్సి ఉంది. ధరకు సంబంధించిన వివరాలపైనా క్లారిటీ లేదు. మార్చ్ 27న జరగనున్న లాంచ్ ఈవెంట్‌తో వీటిపై ఓ స్పష్టత వస్తుంది.