తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio 5g Services: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో జియో 5జీ లాంచ్: పూర్తి వివరాలివే..

Jio 5G Services: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో జియో 5జీ లాంచ్: పూర్తి వివరాలివే..

17 January 2023, 17:00 IST

    • Jio 5G Network: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో 5జీ సర్వీస్‍‍లను జియో నేడు (జనవరి 17) లాంచ్ చేసింది. దీంతో మొత్తంగా ఏపీలోని 9 నగరాలు, తెలంగాణలోని 5 సిటీల్లో ఇప్పటి వరకు జియో 5జీ అందుబాటులోకి వచ్చింది.
Jio 5G Services: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో జియో 5జీ లాంచ్
Jio 5G Services: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో జియో 5జీ లాంచ్

Jio 5G Services: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో జియో 5జీ లాంచ్

Jio 5G Network Cities: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. 5జీ నెట్‍వర్క్ (5G Network) విషయంలో దూసుకుపోతోంది. క్రమంగా 5జీ సర్వీస్‍లను (5G Services) విస్తరిస్తోంది. నేడు (జనవరి 16) ఆంధ్రప్రదేశ్‍ (Andhra Pradesh)లోని మరో రెండు సిటీల్లో, తెలంగాణ (Telangana)లోని ఇంకో రెండు నగరాల్లో ట్రూ 5జీ సర్వీసులను ప్రారంభించింది. ఏపీలోని కర్నూలు (Kurnool), కాకినాడ (Kakinada), తెలంగాణలోని నిజామాబాద్ (Nizamabad), ఖమ్మం (Khammam)లో జియో ట్రూ 5జీ (Jio True 5G) నేడు లాంచ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ నాలుగు సిటీలు సహా మొత్తంగా నేడు దేశవ్యాప్తంగా మరో 16 నగరాల్లో 5జీ నెట్‍వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రస్తుతం జియో 5జీ ఆంధ్రప్రదేశ్‍లోని 9 నగరాల్లో అందుబాటులో ఉంది. ఇక తెలంగాణలో జియో 5జీ సర్వీస్‍లు ఉన్న నగరాల సంఖ్య ఐదుకు చేరింది. పూర్తి వివరాలు ఇవే.

16 నగరాలు ఇవే..

Jio True 5G Cities: ఆంధ్రప్రదేశ్‍లోని కర్నూలు, కాకినాడ, తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం సిటీల్లో జియో నేడు 5జీ సర్వీస్‍లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు సిల్చార్ (అసోం), దేవనగెరె, శివమొగ్గ, బీదర్, హోస్పేట్, గడగ్-బెటాగెరి (కర్ణాటక), మలప్పురం, పాలక్కడ్, కొట్టయమ్, కన్నూర్ (కేరళ), త్రిప్పుర్ (తమిళనాడు), బరేలీ (ఉత్తర ప్రదేశ్) సిటీల్లో జియో 5జీ ప్రారంభమైంది. మొత్తంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 134 నగరాల్లో జియో 5జీ (Jio 5G in 134 Cities) నెట్‍వర్క్ అందుబాటులో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఈ నగరాల్లో..

  • Jio 5G in Andhra Pradesh: ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, తాజాగా కర్నూలు, కాకినాడ నగరాల్లో జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులో ఉంది.
  • Jio 5G in Telangana: తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‍లో ఇప్పటి వరకు జియో 5జీ సర్వీస్‍లు లాంచ్ అయ్యాయి.

ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, మండలాలు, గ్రామాలకు 5జీ నెట్‍వర్క్‌ను విస్తరించాలని రిలయన్స్ జియో లక్ష్యంగా పెట్టుకుంది.

జియో 5జీ కోసం యూజర్లు కొత్తగా సిమ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ నెట్‍వర్క్ కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఉండాలి. కాగా, జియో ప్రస్తుతం 5జీ వెల్కమ్ ఆఫర్ ఇస్తోంది. దీంతో జియో 5జీ నెట్‍వర్క్ పై యూజర్లు ఉచితంగా అన్‍లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‍లను ప్రవేశపెట్టే వరకు జియో ఈ వెల్‍కమ్ ఆఫర్‌ను ఇచ్చే అవకాశం ఉంది.