తెలుగు న్యూస్  /  Business  /  Reliance Jio 5g Launched In Nellore Tirupati 8 More Cities

Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో 5జీ లాంచ్.. వివరాలివే

09 January 2023, 21:09 IST

    • Jio 5G Services launched: ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేసింది రిలయన్స్ జియో (Reliance Jio). దీంతో ప్రస్తుతం ఏపీ (AP)లో జియో ట్రూ 5జీ (Jio True 5G) నెట్‍వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య ఆరుకు చేరింది.
Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో 5జీ లాంచ్..
Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో 5జీ లాంచ్..

Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో 5జీ లాంచ్..

Jio 5G Network launched: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. 5జీ నెట్‍వర్క్‌ను క్రమంగా విస్తరిస్తోంది. దేశంలోని మరో 10 నగరాల్లో 5జీ సర్వీస్‍ను సోమవారం (జనవరి 9) లాంచ్ చేసింది జియో. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో జియో 5జీ తాజాగా ప్రారంభమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‍లో జియో 5జీ ఉన్న నగరాల సంఖ్య ఆరుకు చేరింది. పూర్తి వివరాలు ఇవే.

ఏపీలోని ఆరు సిటీల్లో..

Jio 5G in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‍లోని తిరుపతి, నెల్లూరులో ట్రూ 5జీ సర్వీస్‍లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది జియో. కాగా, గత నెలలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుమల, గుంటూరు నగరాల్లో జియో 5జీ లాంచ్ అయింది. ఇప్పుడు మరో రెండు సిటీల్లో అందుబాటులోకి రావటంతో.. ఏపీలో జియో ట్రూ 5జీ ఉన్న సిటీల సంఖ్య ఆరుకు చేరింది. జియో ప్రస్తుతం 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీంట్లో భాగంగా జియో5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5జీ ఫోన్లు వాడుతున్న వారు ఉచితంగా అన్‍లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.

ఈ ఏడాది చివరి కల్లా ఆంధ్రప్రదేశ్‍లోని అన్ని నగరాలు, మండలాలు, గ్రామాల్లో 5జీని అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించింది. 5జీ కోసం ఏపీలో అదనంగా రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.

కొత్తగా ఈ 10 సిటీల్లో..

నెల్లూరు, తిరుపతితో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో జియో 5జీ సర్వీస్‍లు నేడు లాంచ్ అయ్యాయి. మీటర్, ఆగ్రా, కాన్‍పూర్, ప్రయాగ్‍రాజ్, నాగ్‍పూర్, అహ్మద్‍నగర్, కోజీకోడ్, త్రిస్సూర్ సిటీల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది జియో. దీంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 85 నగరాల్లో జియో 5జీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 5జీ నెట్‍వర్క్ ను విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.