Jio 5G Services: 100 రోజులు, 100 నగరాలు : జియో 5జీ అందుబాటులో ఉన్న సిటీలు ఇవే..
Jio True 5G Cities List: జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ దేశంలోని 100 నగరాలకు చేరుకుంది. 5జీని లాంచ్ చేసిన 100 రోజుల్లోగా 100 సిటీల మార్కును జియో చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని 8 నగరాల్లో జియో 5జీ అందుబాటులో ఉంది. 100 నగరాల లిస్ట్ ఇదే.
Reliance Jio 5G Cities Full List: రిలయన్స్ జియో 5జీ నెట్‍వర్క్ (Jio 5G Network) క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జియో 5జీ సర్వీసులు (5g Services) దేశంలోని 100 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ట్రూ 5జీ సర్వీసులను గతేడాది అక్టోబర్‌లో రిలయన్స్ జియో లాంచ్ చేసింది. 5జీ నెట్‍వర్క్ రోల్అవుట్ మొదలుపెట్టిన 100 రోజుల్లోనే.. 100 నగరాల్లో ఈ కొత్త తరం నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా తమిళనాడులోని ఆరు నగరాల్లో 5జీని లాంచ్ చేయటంతో ఈ సెంచరీ మార్కును జియో అధిగమించింది. ప్రస్తుతం జియో 5జీ నెట్‍వర్క్ (Jio 5G Network) అందుబాటులో ఉన్న నగరాలు ఏవో రాష్ట్రాల వారిగా ఇక్కడ చూడండి.
Jio 5G Cities: ఇప్పటి వరకు జియో 5జీ లాంచ్ అయిన నగరాలు
- ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు
- తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్
- తమిళనాడు: చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, సేలం, హోసూరు, వేలూర్
- కర్ణాటక: బెంగళూరు, మైసూరు, హుబ్లి-ధర్వాడ్, మంగళూరు, బెల్గామ్
- అసోం: గువహటి
- Jio 5G Cities: ఢిల్లీ: ఢిల్లీ
- హర్యానా: ఫరీదాబాద్, గురుగ్రామ్, పంచకుల
- కేరళ: కొచ్చి, త్రివేండ్రం, గురువాయుర్ టెంపుల్, కోజీకోడ్, త్రిస్సూర్, చేర్తలా
- మధ్యప్రదేశ్: భోపాల్, ఇండోర్, ఇజ్జయినీ, గ్వాలియర్, జబల్‍పూర్
- మహారాష్ట్ర: ముంబై, పుణె, ఔరంగాబాద్, నాసిక్, నాగ్‍పూర్, అహ్మద్‍నగర్, సోలాపూర్
- Reliance Jio 5G Cities: ఒడిశా: భువనేశ్వర్, కటక్
- పంజాబ్: మొహాలీ, జికాపుర్, డేరాబసి, ఖరార్, లుథియానా
- రాజస్థాన్: నథ్వాడా, జైపూర్, ఉదయ్‍పూర్, జోధ్‍పూర్
- ఉత్తర్ ప్రదేశ్: వారణాసి, లక్నో, ఘజియాబాద్, నోయిడా, ఆగ్రా, కాన్‍పూర్, మీటర్, ప్రయాగ్‍రాజ్
- ఉత్తరాఖండ్: దెహ్రాదూన్
- పశ్చిమ బెంగాల్: కోల్‍కతా, సిలిగుడి
- చండీగఢ్: చండీగఢ్
- గుజరాత్: గాంధీనగర్, అహ్మదాబాద్, అమేలీ, అహ్వా, బరుచ్, భుజ్, భావ్‍నగర్, బొటాడ్, ఛోటా ఉదయ్‍పూర్, దహోడ్, హిమ్మత్‍నగర్, జునాగఢ్, కలోల్, ఖంబాలియా, లునావడా, మెహ్సానా, నవ్‍సరీ, నడియాద్, పలాన్‍పురి, పాటన్, పోరుబందర్, రాజ్‍కోట్, రాజ్‍పిప్లా, సూరత్, వద్వాన్, వడోదర, వల్సాద్, వ్యారా, వెరావల్
ప్రస్తుతం జియో 5జీ నెట్‍వర్క్ (Jio True 5G Network) అందుబాటులో ఉన్న నగరాలు ఇవి. క్రమంగా 5జీ సర్వీసులను రిలయన్స్ జియో విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ నెట్‍వర్క్ ను విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.