తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pushpa 2 Pajero Car : పుష్పా 2లో అల్లు అర్జున్ వాడిన ఈ కారు.. మళ్లీ భారత్‌లో అమ్మకాలు చేస్తుందా?!

Pushpa 2 Pajero Car : పుష్పా 2లో అల్లు అర్జున్ వాడిన ఈ కారు.. మళ్లీ భారత్‌లో అమ్మకాలు చేస్తుందా?!

Anand Sai HT Telugu

16 December 2024, 17:00 IST

google News
    • Pajero SUV Car : అల్లు అర్జున్ నటించిన పుష్పా 2 సినిమాలో థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో పుష్పరాజ్ వాడిన పజేరో కారుకు ఒకప్పుడు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే మళ్లీ దీనిని భారత్ మార్కెట్‌లో చూడొచ్చా?
పుష్పా 2లో అల్లు అర్జున్
పుష్పా 2లో అల్లు అర్జున్

పుష్పా 2లో అల్లు అర్జున్

పుష్పా 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సౌత్‌లోనూ అటు నార్త్‌లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమా ఇది. ఇందులో అల్లు అర్జున్ వాడిన కారుకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీల తయారీ సంస్థ మిత్సుబిషికి చెందిన పజేరో అంటే చాలా మందికి ఇష్టం. దాని బోల్డ్ లుక్‌తో లవ్‌లో పడిపోతారు. ఈ వాహనం అందరికీ నచ్చడానికి కారణం దాని బోల్డ్ లుక్. నేటికీ చాలామంది హృదయాల్లో పజేరోకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలకు మళ్లీ డిమాండ్ పెరిగుతున్న నేపథ్యంలో సినిమాలో పుష్పరాజ్ వాడిన ఈ కారుకు మళ్లీ క్రేజ్ ఉంటుందా అని చాలా మంది అనుకుంటున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ వాడిన రెడ్ పజేరో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రెండింటిలోనూ బలమైన, బోల్డ్ లుక్ కారణంగా దీనిని ఇప్పటికీ ప్రజలు గుర్తుంచున్నారు. పుష్పా 2లో హీరో పవర్ ఫుల్ రోల్‌కి కూడా ఈ కారు చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది.

పజేరో చాలా విశాలమైన, పెద్ద కారు. మిత్సుబిషి దీనిని 7-సీటర్, 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందించింది. వాహన కొలతల పరంగా 4600ఎంఎం పొడవు, 1800ఎంఎం వెడల్పు, 1900ఎంఎం ఎత్తు, 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 2725ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ అధిక రైడింగ్ సీటింగ్ పొజిషన్‌ను కూడా అందిస్తుంది.

పజేరో వద్ద 2.8-లీటర్ నాలుగు-సిలిండర్ యూనిట్ ఉంది. ఈ ఇంజన్ బ్లాక్ 4000 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 107 బీహెచ్‌పీ శక్తిని, 2000 ఆర్పీఎమ్ వద్ద 275 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు దాని భారీ 92-లీటర్ ఇంధన ట్యాంక్ కారణంగా సుదూర ప్రయాణికులకు బాగా సెట్ అవుతుంది.

ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత అయి ఉంటుంది. మైలేజ్ 13 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. ఇది ముందు భాగంలో టోర్షన్ బార్, స్టెబిలైజర్ బార్‌తో డబుల్ విష్‌బోన్ సెటప్‌ను, వెనుకవైపు స్టెబిలైజర్ బార్‌తో 3-లింక్ కాయిల్ స్ప్రింగ్ సెటప్‌ను పొందుతుంది. వాహనం మొత్తం బరువు 2800 కిలోలు. ఈ కారు నిర్మాణ నాణ్యత, ఆఫ్-రోడ్ సామర్థ్యం నేటికీ అడ్వెంచర్ డ్రైవర్‌లకు ఇష్టమైనదిగా చేస్తుంది. ఈ ఎస్‌యూవీ భారతదేశంలో అందుబాటులో లేనప్పటికీ.. ఒకప్పుడు చాలా మందికి ఇష్టపడేవారు. ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఈ కారు ప్రారంభ ధర రూ.17.91 లక్షల నుంచి 21.87 మధ్య ఉంటుంది.

పజేరో స్పోర్ట్ జనవరి 2020 తర్వాత భారత్‌లో నిలిపివేసింది. ఆ తర్వాత మార్చి 2024లో మిత్సుబిషి థాయిలాండ్‌లో కొత్త పజెరో స్పోర్ట్‌ను పరిచయం చేసింది. కానీ భారత మార్కెట్‌లోకి దాని రాక గురించి ఎటువంటి సమాచారం లేదు. పుష్పా 2 తర్వాత పజేరో భారత్ మార్కెట్‌లోకి ఏమైనా వస్తుందో లేదో చూడాలి.

తదుపరి వ్యాసం