అదిరిపోయే ఇంటర్నెట్ ప్లాన్.. 30 ఎంబీపీఎస్ స్పీడ్, 400కుపైగా లైవ్ టీవీ ఛానల్స్, బోలెడన్ని ఓటీటీలు
RailWire Freedom Plan : రైల్‌టెల్ ఇంటర్నెట్ సర్వీస్ విభాగమైన రైల్‌వైర్ ఫ్రీడమ్ ప్లాన్ పేరుతో కొత్త ఇంటర్నెట్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో ఓటీటీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
రైల్‌టెల్ ఇంటర్నెట్ సర్వీస్ విభాగం రైల్‌వైర్ ఫ్రీడమ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్నెట్ ప్లాన్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌తోపాటు ఓటీటీ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫ్రీడమ్ ప్లాన్ ఓటీటీ బండిల్డ్ హోమ్ ఇంటర్నెట్ ప్లాన్ అని రైల్‌టెల్ చెప్పింది. ఇది వినియోగదారులకు మంచి వినోదాన్ని అందిస్తుందని పేర్కొంది. కొత్త ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం..
టెలికాం టాక్ నివేదిక ప్రకారం ఈ ప్లాన్ 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేవ్స్‌తోపాటుగా తొమ్మిది ప్రీమియం ఓటీటీలు, 400కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు, 200కి పైగా గేమ్స్ వస్తాయి. ఓటీటీ అగ్రిగేటర్‌గా ప్లేబాక్స్ టీవీ భాగస్వామ్యంతో ప్రసార భారతి కొత్తగా ప్రారంభించిన వేవ్స్‌ను విలీనం చేసింది. ఇలా చేసిన తొలి టెలికాం ఆపరేటర్ రైల్‌టేల్.
ప్రసార భారతికి చెందిన వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవల గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ 10కి పైగా ఎంటర్టైన్మెంట్ జానర్లలో అందుబాటులో ఉందని, వీడియో-ఆన్-డిమాండ్, ఫ్రీ-టు-ప్లే గేమింగ్, రేడియో స్ట్రీమింగ్, 65 లైవ్ ఛానల్స్ లైవ్ టీవీ స్ట్రీమింగ్, వీడియో గేమింగ్ కంటెంట్‌లాంటివి అందుబాటులో ఉంటాయి. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సపోర్ట్ ఉన్న ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ అందిస్తుంది.
రైల్‌టెల్ ఎక్స్‌లో పంచుకున్న సమచారం ప్రకారం.. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభంలో 10 మిలియన్ల వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించారు. 100 మిలియన్ల వరకు స్కేలబిలిటీతో ఉంటుంది. రైల్‌టేల్ కాపీరైట్ సేఫ్టీ కోసం అత్యాధునిక కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్), మీడియా అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎంఎఎం), సెక్యూర్ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ (డీఆర్ఎం)ను అమలు చేసింది.
టైర్ -2, టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ప్రధాన స్రవంతి ప్రొవైడర్లు విస్మరించే ప్రాంతాలలో కనెక్టివిటీ, వినోదాన్ని పెంచాలని ఫ్రీడమ్ ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది.