Credit Card Interest: క్రెడిట్ కార్డుల పేరుతో బ్యాంకులు వసూలు చేసే వడ్డీలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలతో పాటు వినియోగదారులకు క్రెడిట్ కార్డులను తీసుకోవాలని ఆఫర్ చేయడం, సగటున క్రెడిట్ కార్డు వినియోగంపై నెలన్నర నుంచి గరిష్టంగా 50రోజుల వరకు చెల్లింపు గడువు ఉండటం వంటి కారణాలతో వేతనజీవులు, మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డుల్న వినియోగించడ గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో చాలామందికి క్రెడిట్ తాము చేసే కొనుగోళ్లపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో స్పష్టత కూడా ఉండదు. దీనిపై వినియోగదారుల కమిషన్లు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాయి.
బ్యాంకు ఖాతాలో నగదు నిల్వతో సంబంధం లేకుండా ఏ వస్తువునుకొనుగోలు చేయాలన్నా జేబులో క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుందనే భావన బాగా పెరిగిపోయింది. అవసరానికి అప్పు పుట్టకపోయినా క్రెడిట్ కార్డుతో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం నుంచి అత్యవసర సమయాల్లో నగదును కూడా తీసుకునే సౌలభ్యం ఉండటంతో వీటికి ఆదరణ పెరిగింది. క్రెడిట్ కూడా వినియోగంలో కనీస జాగ్రత్తలు తీసుకోపోయినా, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పినా ఇబ్బందులు తప్పవు.
చాలామంది క్రెడిట్ కార్డులపై అప్పులు చేసి ఖర్చు పెట్టడం, వాటిని ఈఎంఐలుగా మార్చుకుని అసలు వడ్డీ కలిపి చెల్లించడం చేస్తుంటారు. క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితి వరకు ఇలా కొత్త అప్పు పుడుతూనే ఉంటుంది. పాత అప్పుతో కలిసి అసలు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అనూహ్య పరిణామాలు తలెత్తి, క్రెడిట్ కార్డులకు ఈఎంఐలు చెల్లించకపోతే వడ్డీమీద వడ్డీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు తీరే పరిస్థితి ఉండదు.
కొన్నేళ్ల క్రితం క్రెడిట్ బకాయిల కోసం బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించు కోవడం, బకాయిల కోసం అయా ఏజెన్సీలు చట్టవిరుద్ధంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ వినియోగదారుల కమిషన్ ఇందు మల్హోత్రాను క్రెడిట్ కార్డుల కంపెనీలు వినియోగదారుల మధ్య తలెత్తిన వివాదంలో అమికస్‌క్యూరీగా నియమించింది. ఈ క్రమంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు అప్పులపై ఏడాదికి 36శాతం 42 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. అధిక వడ్డీ రేట్లను క్రెడిట్ కార్డు హోల్డర్ల నుంచి వసూలు చేయడం అక్రమ వడ్డీ వ్యాపారం కిందకు వస్తుందని కమిషన్‌కు నివేదిక ఇచ్చారు.
అధిక వడ్డీ రేట్లను వసూలు చేయకూడదని బ్యాంకులకు ఆర్‌బిఐ జారీ చేసిన సర్క్యూలర్లకు విరుద్దంగా క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు ఉండటం గుర్తించారు. హేతుబద్దమైన వడ్డీరేట్లను మాత్రమే బ్యాంకులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ, బ్యాంకులు, ఫిర్యాదు దారుల వాదనలు విన్న తర్వాత జాతీయ వినియోగదారుల కమిషన్ క్రెడిట్ కార్డు వడ్డీలపై గతంలోనే స్పష్టత ఇచ్చింది. వార్షిక వడ్డీ 36శాతం నుంచి 50శాతం ఉంటే అది అధిక వడ్డీ కిందకు వస్తుందని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు చెల్లింపులు ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను అందించినందుకు అయా సంస్థల నుంచి బ్యాంకులు కమిషన్ వసూలు చేస్తుంటాయి. ఈ కమిషన్లు కూడా క్రెడిట్ కార్డుదారుడే ఛెల్లించాల్సి వస్తోంది. వస్తువు, సేవల ధరల్లో కలిపి కమిషన్లను వసూలు చేస్తుండటాన్ని కమిషన్ తప్పు పట్టింది.
ఏడాదికి 30శాతం మించి వడ్డీ వసూలు చేస్తే దానిని అధిక వడ్డీగా పరిగణిస్తారు. గడువులోగా పూర్తిగా చెల్లించని సొమ్ములో, కనీస మొత్తాన్ని చెల్లించిన వారి నుంచి కూడా గరిష్ట వడ్డీ వసూలు చేయడం అక్రమ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుంది.ఈ క్రమంలో ఒక బకాయికి మాత్రమే జరిమానా విధించే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. దానిని కేపిటలైజ్ చేయకూడదు. నెలవారీ వడ్డీరేట్లతో వడ్డీ వసూలు చేయడం కూడా అక్రమ పద్దతి కిందకు వస్తుంది.
https://www.rbi.org.in/commonman/english/Scripts/Notification.aspx?Id=1574
టాపిక్