తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Neo 7 Vs Poco X5 Pro 5g : ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ.. ఏది బెటర్​?

iQoo Neo 7 vs Poco X5 Pro 5G : ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ.. ఏది బెటర్​?

Sharath Chitturi HT Telugu

19 February 2023, 11:59 IST

google News
    • iQoo Neo 7 vs Poco X5 Pro 5G : ఐకూ నియో 7 5జీ, పోకో ఎక్స్​5 ప్రో 5జీకి మార్కెట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొనుగోలు చేయవచ్చు? అన్నది తెలుసుకుందాము.
ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ.. ఏది బెటర్​?
ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ.. ఏది బెటర్​?

ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ.. ఏది బెటర్​?

iQoo Neo 7 vs Poco X5 Pro 5G : దేశంలో వారానికో స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతోంది! ఫలితంగా మార్కెట్​లో కస్టమర్లకు చాలా ఆప్షన్స్​ లభిస్తున్నాయి. ఉన్న వాటిల్లో ఏది కొనాలని తెగ ఆలోచించేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం మంచి డిమాండ్​ ఉన్న ఐకూ నియో 7, పోకో ఎక్స్​5 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్స్​ని ఓసారి పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏదనేది తెలుసుకుందాము..

ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ- ధర..

iQoo Neo 7 price in India : ఇండియాలో ఐకూ నియో 7 5జీ 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​​ ధర రూ. 29,999. అదే 12జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ ధర రూ. 33,999.

ఇక పోకో ఎక్స్​5 ప్రోలోనూ రెండు మోడల్స్​ ఉన్నాయి. 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 22,999. 8 జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 24,999.

ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ- ఫీచర్స్​..

iQoo Neo 7 features : ఐకూ నియో 7 5జీలో ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఫన్​టచ్​ ఓఎస్​ 13 ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ 120హెచ్​జెడ్​తో కూడిన అమోలెడ్​ డిస్​ప్లే ఉంది. ఆక్టా కోర్​ 4ఎన్​ఎం మీడియాటెక్​ డైమెన్సిటీ 8200 5జీ చిప్​సెట్​ దీని సొంతం. అవసరమైతే 20జీబీ వరకు స్టోరేజ్​ను ఎక్స్​పాండ్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 500ఎంఏహెచ్​ బ్యాటరీ, యూఎఫ్​ఎస్​3.1 ఇన్​బిల్ట్​ స్టోరేజ్​, 5జీ, వైఫై, బ్లూటూత్​, ఓటీజీ, ఎన్​ఎఫ్​సీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​ వంటివి ఇతర ఫీచర్స్​.

ఇక పోకో ఎక్స్​5 ప్రో 5జీలో అడ్రేనో 642ఎల్​ జీపీయూతో కూడిన క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్​ ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్​ ఎక్స్​ఫినిటీ 120 హెచ్​జెడ్​ రిఫ్రె రేట్​తో కూడిన అమోలెడ్​ డిస్​ప్లే ఉంది. హెచ్​డీఆర్​10+, కార్నింగ్​ గొరిల్ల గ్లాస్​ 5 వంటివి వస్తాయి. 8జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్​, 256 జీబీ యూఎఫ్​ఎస్​ 2.2 స్టోరేజ్​ కలదు. ఇది ఆండ్రాయిడ్​ 12 కస్టమ్​ ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, యూఎస్​బీ టైప్​-సీ పోర్ట్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జ్యాక్​, డ్యూయెల్​ బ్యాండ్​ వైఫై, బ్లూటూత్​ 5.1 వంటివి ఇతర ఫీచర్స్​గా ఉన్నాయి.

ఐకూ నియో 7 వర్సెస్​ పోకో ఎక్స్​5 ప్రో 5జీ- కెమెరా సెటప్​..

Poco X5 Pro 5G price in India : ఐకూ నియో 7 5జీ రేర్​లో ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​ సెటప్​ ఇది.

Poco X5 Pro 5G features : ఇక పోకో ఎక్స్​5 ప్రోలో 108ఎంపీ ఐఎస్​ఓసీఈఎల్​ఎల్​ హెచ్​ఎం2 ప్రైమరీ సెన్సార్​, 8ఎంపీ అల్ట్రా- వైడ్​ సెన్సార్​, 2ఎంపీ మాక్రో సెన్సార్​ కెమెరా సెటప్​ ఉంది. రేర్​ కెమెరా సెటప్​తో 4కే వీడియోలు షూట్​ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ కోసం ఇందులో 16ఎంపీ కెమెరా వస్తోంది.

తదుపరి వ్యాసం