Samsung Galaxy A23 : రూ. 2,299కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23.. అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు!-get samsung galaxy a23 5g for just 2 299 on amazon original price is 23990 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Get Samsung Galaxy A23 5g For Just 2,299 On Amazon Original Price Is 23990

Samsung Galaxy A23 : రూ. 2,299కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23.. అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు!

Sharath Chitturi HT Telugu
Feb 19, 2023 10:28 AM IST

Samsung Galaxy A23 5G price cut : రూ. 23,990గా ఉండే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్​. ఫలితంగా ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ. 2,290కే దక్కించుకోవచ్చు! ఎలా అంటే..

రూ. 2,299కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23.. అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు!
రూ. 2,299కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23.. అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు!

Samsung Galaxy A23 5G price cut : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో వరుసగా గ్యాడ్జెట్​లను లాంచ్​ చేస్తోంది శాంసంగ్​. గత రెండు నెలల్లో ఈ దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ నుంచి ఫ్లాగ్​షిప్​, మిడ్​- రేజ్​, బడ్జెట్​ ధరల్లో పలు ఆకర్షణీయమైన మొబైల్స్​ వచ్చాయి. వీటిల్లో శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీ ఒకటి. ఇదొక మిడ్​రేంజ్​ ఫోన్​. దీని వాస్తవ ధర రూ. 23,990. కానీ అమెజాన్​లో ఉన్న ఆఫర్స్​తో ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ. 2,299కే దక్కించుకోవచ్చు. అది ఎలా అంటే..

ట్రెండింగ్ వార్తలు

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీపై డిస్కౌంట్లు..

Amazon offers on Samsung Galaxy A23 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రీటైల్​ ధర రూ. 23,990. ప్రస్తుతం ఇది అమెజాన్​లో 27శాతం డిస్కౌంట్​తో రూ. 17,499కి లభిస్తోంది. అయితే.. ఈ స్మార్ట్​ఫోన్​పై అనేక బ్యాంక్​లు ఆఫర్లు ఇస్తున్నాయి. అమెక్స్​ అండ్​ స్టాండర్డ్​ ఛార్టెడ్​ ట్రాన్సాక్షన్స్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 1,500 ఆఫ్​ ఉంది. హెచ్​ఎస్​బీసీ క్యాష్​బ్యాక్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​ ట్రాన్సాక్షన్స్​పై రూ. 250 తగ్గింపు లభిస్తోంది.

అంతేకాకుండా.. ఈ స్మార్ట్​ఫోన్​పై ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కూడా ఉంది. పాత స్మార్ట్​ఫోన్​ ఇస్తే.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీపై రూ. 13,700 డిస్కౌంట్​ లభిస్తుంది. ఫలితంగా.. ఈ స్మార్ట్​ఫోన్​ మొత్తం మీద రూ. 2,299కే వస్తోంది. (అయితే.. పాత స్మార్ట్​ఫోన్​ పనితీరు ఆధారంగా ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ఎంత ఉంటుందనేది నిర్ణయిస్తారు.)

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీ- ఫీచర్స్​..

Samsung Galaxy A23 5G features : శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ23 5జీలో 6.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఇన్ఫినిటీ వీ డిస్​ప్లే ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ దీని సొంతం. 16జీబీ ర్యామ్​, ర్యామ్​+ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ క్వాడ్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. అల్ట్రా-వైడ్​, డెప్త్​, మాక్రో లెన్సెన్స్​ వీటిల్లో ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​కు మంచి రివ్యూస్​ వచ్చాయి. చాలా మంది కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు.

WhatsApp channel