తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ios 18 Release Date : ఈ ఐఫోన్స్​కి మాత్రమే ఐఓఎస్​ 18 అప్డేట్​! లిస్ట్​లో మీ గ్యాడ్జెట్​ ఉందా?

iOS 18 release date : ఈ ఐఫోన్స్​కి మాత్రమే ఐఓఎస్​ 18 అప్డేట్​! లిస్ట్​లో మీ గ్యాడ్జెట్​ ఉందా?

Sharath Chitturi HT Telugu

16 September 2024, 12:30 IST

google News
  • ఇండియాలో ఐఓఎస్​ 18 అప్డేట్​పై కీలక అప్డేట్​! ఈ ఐఓఎస్​ 18 సోమవారం భారత కస్టమర్స్​కి అందుబాటులోకి వస్తుంది. టైమ్​తో పాటు ఏ గ్యాడ్జెట్స్​లో ఈ సాఫ్ట్​వేర్​ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు? కొత్త సాఫ్ట్​వేర్​ ఫీచర్స్​ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో ఐఓఎస్​ 18 లాంచ్​ టైమ్​ వివరాలు..
ఇండియాలో ఐఓఎస్​ 18 లాంచ్​ టైమ్​ వివరాలు.. (9to5Mac)

ఇండియాలో ఐఓఎస్​ 18 లాంచ్​ టైమ్​ వివరాలు..

ఐఓఎస్​ 18 కొత్త సాఫ్ట్​వేర్​ అప్డేట్​ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్​ కస్టమర్స్​కి అలర్ట్​. ఐఫోన్​ 16 సిరీస్​ లాంచ్​ సమయంలో యాపిల్​ సంస్థ ప్రకటించినట్టుగానే ఐఓఎస్​ 18 అప్డేట్​ సోమవారం లాంచ్​ కానుంది. అయితే ఏ ఐఫోన్స్​కి ఈ అప్డేట్​ ఉంటుంది? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానితో పాటు సరికొత్త ఐఓఎస్​ 18 ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో ఐఓఎస్​ 18 అప్డేట్​ టైమ్​..

ఐఫోన్​ 16 సిరీస్​ని ఈ నెల 9న యాపిల్​ సంస్థ లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. కొత్త సిరీస్​ లాంచ్​ అయిన వారం రోజులకు సాఫ్ట్​వేర్​ అప్డేట్​ రిలీజ్​ అవుతుందని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఫలితంగా ఇండియాలో కూడా సెప్టెంబర్​ 16న ఐఓఎస్​ 18 అప్డేట్​ లాంచ్​ అవుతుంది. భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులు సెప్టెంబర్ 16 రాత్రి 10:30 గంటలకు కొత్త ఐఓఎస్ 18 ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలుస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో ఆవిష్కరించిన ఐఓఎస్ 18 జూన్ నుంచి డెవలపర్లు, బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది కొత్త ఫీచర్లు, అనేక అప్డేట్స్​తో వస్తోంది.

ఈ ఐఫోన్స్​కి మాత్రమే ఐఓఎస్​ 18 అప్డేట్​..

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ వంటి మోడళ్లు సెప్టెంబర్ 16 రాత్రి 10:30 గంటలకు భారతదేశంలో ఐఓఎస్ 18ని పొందుతాయి.

కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ ఏఐ ఆధారిత ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.

ఐఓఎస్​ 18 ఫీచర్స్​ ఇవే..

హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్: వినియోగదారులు తమకు కావాల్సిన చోట యాప్ ఐకాన్ల స్థానాన్ని మార్చుకునేలా యాపిల్ హోమ్ స్క్రీన్​కు పలు కస్టమైజెబుల్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా యూజర్లు తమ వాల్ పేపర్ లేదా కలర్ కాంట్రాస్ట్​కు సరిపోయేలా యాప్ ఐకాన్ కలర్​ను కూడా మార్చుకోవచ్చు.

కంట్రోల్​ సెంటర్ కస్టమైజేషన్: ఐఓఎస్ 18తో ఐఫోన్ యూజర్లు తమ సౌలభ్యం, వినియోగం ఆధారంగా కొత్త కంట్రోల్స్​ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు మల్టిపుల్​ పేజీలను కంట్రోల్​ చేసేందుకు స్వైప్​ ఫీచర్​ వస్తోంది.

ప్రైవసీ ఫీచర్లు: యాపిల్ యాప్ లాక్ వంటి అధునాతన ప్రైవసీ కంట్రోల్స్​ని ప్రవేశపెట్టింది సంస్థ. ఇది యూజర్ ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలదు. ఇప్పుడు, వినియోగదారులు తమ సున్నితమైన యాప్స్​ హైడ్​ చేయవచ్చు లేదా వారి యాప్స్​, ఇతర బ్లూటూత్-కనెక్టెడ్ పరికరాలకు సమాచార యాక్సెస్​ని కంట్రోల్​ నిర్వహించవచ్చు.

సరికొత్త ఐఓఎస్​ 18 పూర్తి ఫీచర్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం