Budget Electric Cars : బడ్జెట్ ధరల్లో లభించే ఎలక్ట్రిక్ కార్లు.. ఇందులో మీకు ఏది ఇష్టం?-best electric cars under 11 lakh tata tiago ev mg windsor ev tata punch ev mg comet ev in list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Electric Cars : బడ్జెట్ ధరల్లో లభించే ఎలక్ట్రిక్ కార్లు.. ఇందులో మీకు ఏది ఇష్టం?

Budget Electric Cars : బడ్జెట్ ధరల్లో లభించే ఎలక్ట్రిక్ కార్లు.. ఇందులో మీకు ఏది ఇష్టం?

Anand Sai HT Telugu
Sep 15, 2024 10:30 PM IST

Electric Cars Under Budget : బడ్జెట్ ధరలో కార్లు కొనాలని చూస్తుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్‌ రేట్‌లో మంచి ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

ఎంజీ విండ్సర్ ఈవీ
ఎంజీ విండ్సర్ ఈవీ

కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ వాహన తయారీ సంస్థలు అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. మీరు సరికొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలు ఉన్నాయి. ఈ కార్ల గురించి తెలుసుకుందాం..

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీ కారు ధర రూ.7.99 లక్షల నుండి రూ.11.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 19.2 KWh, 24 KWh బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్ పెడితే 221 నుంచి 225 కి.మీ. ఇందులో 5 మంది కూడా వెళ్లవచ్చు. టాటా టియాగో EV 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆటో AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది ప్రయాణికులకు గరిష్ట రక్షణను అందించడానికి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్)తో సహా వివిధ భద్రతా లక్షణాలతో వస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ

ఎంజీ విండ్సర్ ఈవీ కారు సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. 38 KWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎంజీ విండ్సర్ ఈవీ 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌తో సహా పలు ఫీచర్లతో వస్తుంది. భద్రత పరంగా ఇది 6-ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను పొందుతుంది.

ఎంజీ కామెట్

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు రూ.6.99 లక్షల నుండి రూ.9.53 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఇది 17.3 KWh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 7.4 KW ఛార్జర్‌ని ఉపయోగించి 0-100 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కారు బ్యాటరీ ప్యాక్ కేవలం 3.5 గంటలు పడుతుంది. ఈ ఈవీలో 4గురు వెళ్లవచ్చు. ఇది 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది 25 KWh, 35 సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్‌తో 265 నుంచి 365 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ పంచ్ ఈవీలో 5 మంది కూడా ప్రయాణించవచ్చు. ఇందులో 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.