HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indigo Flights: ఇక బెంగళూరు నుంచి కూడా అబుదాబి కి డైరెక్ట్ ఫ్లైట్; ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్

Indigo Flights: ఇక బెంగళూరు నుంచి కూడా అబుదాబి కి డైరెక్ట్ ఫ్లైట్; ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్

HT Telugu Desk HT Telugu

29 June 2024, 14:31 IST

  • Indigo Flights: అబుదాబికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ కొత్తగా బెంగళూరు నుంచి అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్ సేవలను ప్రారంభిస్తోంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి వారానికి ఆరు విమానాలను ఈ రూట్లో నడపాలని ఇండిగో నిర్ణయించింది.

బెంగళూరు - అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్
బెంగళూరు - అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్

బెంగళూరు - అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్

Indigo Flights: భారతీయులకు, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అబుదాబీ వెళ్లడం ఇక మరింత సులువు కానుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి బెంగళూరు-అబుదాబి (Bengaluru-Abu Dhabi route) మధ్య కొత్త డైరెక్ట్ ఫ్లైట్ రూట్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ బెంగళూరు - అబుదాబి మార్గంలో వారానికి ఆరు విమానాలను నడపాలని ఇండిగో ఎయిర్లైన్స్ యోచిస్తోంది. భారతీయ ప్రయాణికులకు సేవలందించడంతో పాటు, బెంగళూరుకు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో తెలిపింది.

బెంగళూరు నుంచి రాత్రి 9.25 గంటలకు

6ఈ 1438 నంబరు గల ఈ కొత్త విమానం మంగళవారం మినహా వారంలోని మిగతా అన్ని రోజుల్లో ప్రతి రోజూ రాత్రి 9.25 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 11.30 గంటలకు అబుదాబి చేరుకుంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అలాగే, బుధవారం మినహా. వారంలోని మిగతా అన్ని రోజుల్లో, ప్రతీ రోజు అబుదాబి నుంచి 6ఈ 1439 విమానం అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు ల్యాండ్ అవుతుంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరుకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానికి మధ్య కనెక్టివిటీని పెంచడం, వ్యాపార, టూరిజం ప్రయాణీకులకు వసతి కల్పించడం ఈ విమాన సేవలను ప్రారంభించడానికి గల ప్రధాన ఉద్దేశమని ఇండిగో (indigo) తెలిపింది.

భారతదేశంలోని 10 నగరాల్లో

ఈ మార్గాన్ని ప్రారంభించడంతో, ఇండిగో భారతదేశంలోని 10 నగరాల్లో సేవలను అందిస్తున్న తన విమానాల సంఖ్యను 75 కు పెంచింది. ‘‘ఇండిగో నెట్ వర్క్ లో అబుదాబి- భారత్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు అందిస్తున్న పదో నగరం బెంగళూరు. ఈ విమానాలతో అబుదాబికి 75 వీక్లీ ఫ్రీక్వెన్సీలను, యూఏఈకి 220కి పైగా ఫ్రీక్వెన్సీలను ఇండిగో అందిస్తుంది’’ అని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్