తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indigo Offer: విమానయాన సంస్థ ‘ఇండిగో’ నుంచి బంపర్ ఆఫర్; రూ. 1199 కే ఫ్లైట్ జర్నీ

IndiGo offer: విమానయాన సంస్థ ‘ఇండిగో’ నుంచి బంపర్ ఆఫర్; రూ. 1199 కే ఫ్లైట్ జర్నీ

HT Telugu Desk HT Telugu

29 May 2024, 13:51 IST

google News
  • ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి సమ్మర్ సేల్ ను ప్రకటించింది. రూ. 1199 కే ఫ్లైట్ జర్నీ అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్ 2024 మే 29 నుంచి మే 31 వరకు ఉంటుంది. అలాగే, ఇతర మహిళా ప్రయాణీకులు ముందుగా బుక్ చేసుకున్న సీట్లను చూడడానికి మహిళా ప్రయాణికులను అనుమతించే కొత్త ఫీచర్ ను కూడా ఇండిగో ప్రారంభించింది.

ఇండిగోలో రూ. 1,199 కే ఫ్లైట్  జర్నీ
ఇండిగోలో రూ. 1,199 కే ఫ్లైట్ జర్నీ

ఇండిగోలో రూ. 1,199 కే ఫ్లైట్ జర్నీ

IndiGo offer: వెబ్ చెక్-ఇన్ సమయంలో మహిళా ప్రయాణీకులు ఇతర మహిళా ప్రయాణికులు ఏ సీట్లను ముందుగా బుక్ చేసుకున్నారో చూడటానికి వీలు కల్పించే కొత్త ఫీచర్ ను ఇండిగో ప్రారంభించింది. ఈ ఫీచర్ వల్ల ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ పక్క సీట్లలో మహిళలే ఉండేలా చూసుకునే వీలు కలుగుతుంది. అది వారికి ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తుందని ఇండిగో వివరించింది.

వెబ్ చెక్-ఇన్ సమయంలో మాత్రమే..

అయితే, ఈ అవకాశం వెబ్ చెక్-ఇన్ సమయంలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మహిళా ప్రయాణీకులు బుక్ చేసుకున్న సీట్లను వీక్షించే వీలు ఈ ఫీచర్ అందిస్తుంది. ఇది ప్రత్యేకంగా మహిళా ప్రయాణీకులతో పిఎన్ఆర్ లకు అనుగుణంగా రూపొందించబడింది. సోలోగా, అదే విధంగా ఫ్యామిలీ బుకింగ్స్ లో భాగంగా ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయవచ్చు. ‘‘ఇది ప్రస్తుతం పైలట్ మోడ్ లో ఉంది’’ అని ఇండిగో (IndiGo) ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

అదనపు భద్రత, సౌకర్యం

ఈ ఫీచర్ ద్వారా మహిళా ప్రయాణికులు, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే వారు అదనపు భద్రత, సౌకర్యం కోసం మరో ప్రయాణికురాలి పక్క సీటును ఎంచుకోవచ్చు. మహిళా ప్రయాణీకుల అవసరాలను మెరుగ్గా తీర్చడానికి ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టే ముందు విమానయాన సం ఇండిగో (IndiGo) దీనిపై మార్కెట్ రీసెర్చ్ నిర్వహించింది.

ఇండిగో సమ్మర్ డిస్కౌంట్ సేల్

అదనంగా, ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అద్భుతమైన సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఛార్జీలు రూ.1,199/- నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ 2024 మే 29 నుంచి మే 31 వరకు ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లతో జూలై 01 నుంచి సెప్టెంబర్ 30, 2024 మధ్య ప్రయాణాలు చేయవచ్చు. కస్టమర్లు ఇష్టమైన సీటు ఎంపిక ఛార్జీలపై 20% వరకు ప్రత్యేక డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఇండిగో వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు.

తదుపరి వ్యాసం