తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Basalt Vision : సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ ఎస్​యూవీ.. త్వరలోనే లాంచ్​!

Citroen Basalt Vision : సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ ఎస్​యూవీ.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

26 March 2024, 6:22 IST

google News
    • Citroen Basalt Vision SUV : సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్ కూపే ఎస్​యూవీని రివీల్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుందో సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్
సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్

సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్

Citroen Basalt Vision : ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కి ఉన్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడుతున్నాయి. సిట్రోయెన్​ సంస్థ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఇండియా, సౌత్​ అమెరికా మార్కెట్​ల కోసం ఓ కొత్త కూపే ఎస్​యూవీని రూపొందించింది. దాని పేరు సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​. ఈ వెహికిల్​ని.. మార్చ్​ 27న రివీల్​ చేయనుంది సంస్థ. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ టీజర్​ని విడుదల చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ కూపే ఎస్​యూవీ..

సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​.. ఒక కాంపాక్ట్​ కూపే ఎస్​యూవీ. దీనిని సీ- క్యూబ్​డ్​ ప్లాట్​ఫామ్​పై తయారు చేస్తోంది సిట్రోయెన్​ సంస్థ. సీ3, ఈసీ3, సీ3 ఎయిర్​క్రాస్​లని కూడా ఈ ప్లాట్​ఫామ్​పైనే తయారు చేసింది.

ఇక తాజాగా బయటకు వచ్చిన టీజర్​లో.. బసాల్ట్​ విజన్​ కాంపాక్ట్​ కూపే ఎస్​యూవీ రూఫ్​లైన్​, సరికొత్త ఎల్​ఈడీ టెయిల్​లైట్​ డిజైన్​ రివీల్​ అయ్యాయి. రేక్​డ్​ రేర్​ విండ్​స్క్రీన్​.. బూట్​లోకి మర్జ్​ అవుతోంది. ఫలితంగా.. ఈ ఎస్​యూవీ లుక్స్​ మరింత షార్ప్​గా, బోల్డ్​గా అయ్యాయి. మార్కెట్​లో కూపై స్టైల్​ ఎస్​యూవీలకు రానున్న రోజుల్లో క్రేజీ డిమాండ్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే బసాల్ట్​ విజన్​ ఎస్​యూవీని సిద్ధం చేస్తోంది సిట్రోయెన్​. అయితే.. త్వరలో లాంచ్​కానున్న టాటా కర్వ్​ ఐసీఈతో ఈ మోడల్​ పోటీ ఎదుర్కొంటుంది.

Citroen Basalt Vision launch date in India : సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ సైజు.. సీ3 ఎయిర్​క్రాస్​తో పోలి ఉండొచ్చు. కానీ ఇదొక 5 సీటర్​ అవ్వొచ్చు. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​లో 7 సీటర్​ ఉంటుంది. కొత్త వెహికిల్​ ఫ్రెంట్​, రేర్​ డిజైన్​లో స్వల్ప మార్పులు కనిపించొచ్చు. సాధారణంగా.. సీ- క్యూబ్​ మోడల్స్​లో ప్రీమియం డిజైన్​ కనిపిస్తుంది. అయితే.. సిట్రోయెన్​ సిగ్నేచర్​ గ్రిల్​, డీఆర్​ఎల్స్​.. కొత్త మోడల్​లో కూడా ఉంటాయని అంచనాలు ఉన్నాయి.

ఇక.. కేబిన్​ విషయానికొస్తే.. సీ3 ఎయిర్​క్రాస్​లోని చాలా ఫీచర్స్​.. ఈ సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ కూపే ఎస్​యూవీల్లో ఉండొచ్చు. 10.1 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, యాపిల్​ కార్​ప్లే- ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీ, 7 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ ఓఆర్​వీఎంలు, క్లైమేట్​ కంట్రోల్​, కీలెస్​ ఎంట్రీ, స్టార్ట్​- స్టాప్​ బటన్​తో పాటు అనేక ఫీచర్స్​ ఇందులో ఉండొచ్చు.

ఇక ఇంజిన్​ విషయానికొస్తే.. సిట్రోయెన్​ బసాల్ట్​ విజన్​ కూపే ఎస్​యూవీలో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు.

Citroen Basalt Vision price in India : మార్చ్​ 27న ఈ మోడల్​ని సంస్థ రివీల్​ చేస్తుంది. ఆ తర్వాత లాంచ్​ ఈవెంట్​ ఉండొచ్చు. ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంది. లాంచ్​ టైమ్​ నాటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై సిట్రోయెన్​ సంస్థ గట్టిగానే ఫోకస్​ చేసినట్టు కనిపస్తోంది. ఇప్పటికే సాలిడ్​ లైనప్​ని సిద్ధం చేసింది. రానున్న నెలల్లో మరికొన్ని మోడల్స్​ని ఇండియాలోకి తీసుకురావాలని ప్లాన్​ చేస్తోంది. వాటిల్లో ఒకటి.. సీ3ఎక్స్​ క్రాస్​- సెడాన్​.

తదుపరి వ్యాసం