తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Venue : హ్యుందాయ్​ వెన్యూ సరికొత్త ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Hyundai VENUE : హ్యుందాయ్​ వెన్యూ సరికొత్త ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

18 August 2023, 13:52 IST

google News
    • Hyundai VENUE Knight Edition : హ్యుందాయ్​ వెన్యూ నైట్​ ఎడిషన్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్​ వెన్యూ సరికొత్త ఎడిషన్​ లాంచ్​..
హ్యుందాయ్​ వెన్యూ సరికొత్త ఎడిషన్​ లాంచ్​..

హ్యుందాయ్​ వెన్యూ సరికొత్త ఎడిషన్​ లాంచ్​..

Hyundai VENUE Knight Edition : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​.. జోరు మీద ఉంది! ఇండియాలో సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా ఉన్న క్రేటా, అల్కజార్​లకు 'అడ్వెంచర్​​' ఎడిషన్​ను ఇటీవలే లాంచ్​ చేసిన ఈ సంస్థ.. తాజాగా వెన్యూ ఎస్​యూవీకి కూడా కొత్త అవతారాన్ని ఇచ్చింది. హ్యుందాయ్​ వెన్యూ నైట్​ ఎడిషన్​ తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ వెన్యూ నైట్​ ఎడిషన్​..

వెన్యూ ఎస్​యూవీలో బ్లాక్​ పెయింటెడ్​ గ్రిల్​ వస్తోంది. అలాయ్​ వీల్స్​, వీల్​ కవర్స్​ వంటివి కూడా బ్లాక్​లోనే ఉండనున్నాయి. ఇక ఈ వెహికిల్​ కేబిన్​లో కూడా ఆల్​-బ్లాక్​ థీమ్​ కనిపిస్తుంది. ఫలితంగా ఆ మోడల్​ మరింత అట్రాక్టివ్​గా మారింది.

ఈ కొత్త ఎడిషన్​లో డ్యూయెల్​ కెమెరా సెటప్​తో కూడిన డాష్​క్యామ్​, సన్​రూఫ్​, స్పోర్టీ మెటాలిక్​ ప్యాడెల్స్​, ఎలక్ట్రో-క్రోమిక్​ ఐఆర్​వీఎం వంటి ఫీచర్స్​ సైతం లభిస్తున్నాయి. వీటితో పాటు ఎయిర్​ ప్యూరిఫయర్​, యాంబియెంట్​ లైటింగ్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, బాస్​ సౌండ్​ సిస్టెమ్​ వంటివి కూడా ఉన్నాయి.

వెన్యూ నైట్​ ఎడిషన్​.. ధర ఎంతంటే!

Hyundai VENUE Knight Edition price : ఈ ఎస్​యూవీలో 1.2 లీటర్​ ఇన్​లైన్​ 4 పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ లభిస్తోంది. దీని పేరు వెన్యూ ఎస్​ (ఓ) నైట్​ ఎంటీ వర్షెన్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలు.

ఇదీ చూడండి:- MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్​ ఈవీ గేమర్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

ఇక 1.0 లీటర్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉంది. ఇందులో 7 స్పీడ్​ డీసీటీ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది. దీని పేరు వెన్యూ ఎస్​ఎక్స్​ (ఓ) డీసీటీ డ్యూయెల్​ టోన్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 13.48లక్షలు.

క్రేటా.. అల్కజార్​..

హ్యుందాయ్​ క్రేటా, అల్కజార్​ ఈ కొత్త ఎడిషన్స్​​లో బ్లాక్​డ్​- ఔట్​ స్కిడ్​ ప్లేట్స్​, గ్రిల్​, సైడ్​ సిల్స్​, రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, షార్క్​ ఫిన్​ యాంటీనా, అలాయ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్​ ఫెండర్​పై "అడ్వెంచర్​" ఎంబ్లమ్​ ఉంటుంది. ఇక రేర్​లో డార్క్​ క్రోమ్​ ఫినీష్​తో కూడిన హ్యుందాయ్​ లోగో లభిస్తోంది. ఇక ఇంటీరియర్​లో ఆల్​- బ్లాక్​ థీమ్​, కొత్త అప్​హోలిస్ట్రీ, సేజ్​ గ్రీన్​ ఇన్​సర్ట్స్​, డ్యూయెల్​ కెమెరా డాష్​క్యామ్​, మెటల్​ పాడ్స్​, అడ్వెంచర్​ స్పెక్​ మాట్స్​లు మరింత స్టైల్​ను యాడ్​ చేసే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం