తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Hf Deluxe Black Canvas Edition : హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​..

Hero HF Deluxe black canvas edition : హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

03 June 2023, 13:06 IST

google News
    • Hero HF Deluxe black canvas edition : హీరో మోటోకార్ప్​కు బెస్ట సెల్లింగ్​ మోడల్​గా ఉన్న హెచ్​ఎఫ్​ డీలక్స్​కు కొత్త ఎడిషన్​ లాంచ్​ అయ్యింది. దీని పేరు హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ బ్లాక్​ కాన్వాస్​. ఈ బైక్​కు చెందిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​..
హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​.. (HT AUTO)

హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​..

Hero HF Deluxe black canvas edition : హెచ్​ఎఫ్​ డీలక్స్​ బ్లాక్​ కాన్వాస్​ ఎడిషన్​ను లాంచ్​ చేసింది హీరో మోటోకార్ప్​. సరికొత్త ఫీచర్స్​, కలర్​ ఆప్షన్స్​తో వస్తున్న ఈ బైక్​.. కిక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 60,760. సెల్ఫ్​ స్టార్ట్​ వేరియంట్​ ధర రూ. 66,408గా ఉంది. ఈ 100సీసీ బైక్​ ఇప్పుడు ఆల్​ న్యూ బ్లాక్​ పెయింట్​ స్కీమ్​లో అందుబాటులో ఉంది. బైక్​పై 3డీ హెచ్​ఎఫ్​ డీలక్స్​ ఎంబ్లమ్​ కూడా వస్తోంది.

కొత్త రంగులు..

ఈ హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ బ్లాక్​ కాన్వాస్​ ఎడిషన్​లో నెక్సస్​ బ్లూ, కాండీ బ్లేజింగ్​ రెడ్​, హెవీ గ్రే విత్​ బ్లాక్​, బ్లాక్​ విత్​ స్పోర్ట్స్​ రెడ్​ వంటి కలర్స్​ లభిస్తున్నాయి. బైక్​లోని సెల్ఫ్​ స్టార్ట్, ఐ3ఎస్​​ వేరియంట్​ల​లో ట్యూబ్​లెస్​ టైర్స్​తో పాటు యూఎస్​బీ ఛార్జర్​ కూడా వస్తోంది. బైక్​పై 5ఏళ్ల వారెంటీ, 5 ఫ్రీ సర్వీస్​ ఛార్జీలను ఇస్తోంది హీరో సంస్థ.

"హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​.. ఇప్పటికే 20మిలియన్​ క్లబ్​లో ఉంది. ఇక కొత్త ఎడిషన్​తో మరిన్ని మైలురాయిలకు చేరుకుంటామని మాకు నమ్మకం ఉంది," అని హీరో మోటోకార్ప్​ చీఫ్​ గ్రోత్​ ఆఫీసర్​ రంజీవ్​జిత్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చూడండి:- Best electric scooters in India : మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!

హోండా షైన్​ 100కు పోటీగా..!

Hero HF Deluxe black canvas edition price : హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ బ్లాక్​ కాన్వాస్​ ఎడిషన్​లో 97.2సీసీ సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. స్టాండర్డ్​ మోడల్​లోనూ ఇదే ఇంజిన్​ను వాడుతున్నారు. ఈ ఇంజిన్​.. 8000 ఆర్​పీఎం వద్ద 7.9 బీహెచ్​పీ పవర్​ను, 6000 ఆర్​పీఎం వద్ద 8.05 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ ఈ బైక్​లో ఉంటుంది. టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​, హాలోజెన్​ హెడ్​ల్యాంప్​, 130ఎంఎం డ్రమ్​ బ్రేక్స్​ వంటివి ఇందులో వస్తున్నాయి.

ఈ బైక్​.. హోండా షైన్​ 100, బజాజ్​ ప్లాటీనా వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం