Hyundai IONIQ 7 : 400కి.మీ రేంజ్‌తో హ్యుందాయ్ ఐయానిక్ 7.. లాంచ్‌కు రెడీ!
20 November 2023, 11:05 IST
- Hyundai IONIQ 7 : హ్యుందాయ్ ఐయానిక్ 7 ఈవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ వెహికిల్ టెస్ట్ రన్ ఇటీవలే జరిగింది. పూర్తి వివరాలు..
400కి.మీ రేంజ్‌తో హ్యుందాయ్ ఐయానిక్ 7 ఈవీ..
Hyundai IONIQ 7 : సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు హ్యుందాయ్ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. దీని పేరు ఐయానిక్ 7. టెస్ట్ రన్ దశలో ఉన్న ఈ మోడల్‌కు సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఐయానిక్ 7 విశేషాలు..
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్.. ఓ త్రీ- రో ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ ఈవీ.. కియా ఈవీ9ని పోలి ఉంటుందని టాక్ నడుస్తోంది. 2021లోనే దీని కాన్సెప్ట్ వర్షెన్‌ను రివీల్ చేసింది సంస్థ. ఇక టెస్ట్ రన్ దశలో ఉంది కాబట్టి.. ఈ హ్యుందాయ్ ఐయానిక్ 7.. 2024లోనే లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Hyundai IONIQ 7 price in India : ఈ కొత్త ఈవీ డిజైన్.. ఐయానిక్ 5ని పోలి ఉంది. మస్క్యులర్ హుడ్, స్లెండర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, వర్టికల్లీ అరెంజ్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి కనిపిస్తాయి. అదనంగా.. రూఫ్ రెయిల్స్, బ్లాక్డ్ ఔట్ రూఫ్, వైడ్ వీల్ ఆర్చీస్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంలు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇక రేర్‌లో మినిమలిస్ట్ డిజైన్ కనిపిస్తోంది. వర్టికల్లీ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, రిసెస్డ్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఉంటాయి.
ఇదీ చూడండి:- Hyundai Kona Jayde : హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. సూపర్ డిజైన్‌తో!
హ్యుందాయ్ ఐయానిక్ 7 రేంజ్ ఎంత?
హ్యుందాయ్ కొత్త ఈవీని ఈ-జీఎంపీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తోంది సంస్థ. ఐయానిక్ 5తో పాటు కియా ఈవీ6, ఈవీ9లు కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ని షేర్ చేసుకుంటున్నాయి. ఇక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్‌కి మాత్రం 76.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వస్తుందని సమాచారం. ఇక టాప్ ఎండ్ వేరియంట్‌కి 99.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400కి.మీల వరకు ప్రయాణించవచ్చు!
Hyundai IONIQ 7 release date : ఇక హ్యుందాయ్ ఐయానిక్ 7 కేబిన్ ఫీచర్స్, ధర వంటి వివరాలపై క్లారిటీ లేదు. లాంచ్ డేట్‌పైనా స్పష్టత లేదు. వీటిపై సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంతర్జాతీయ లాంచ్ తర్వాత.. కొన్ని నెలల్లోనే, ఈ మోడల్ ఇండియాలోకి అడుగుపెడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఐయానిక్ ఈవీలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.