Hyundai Ioniq 5 N : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎన్​.. పర్​ఫార్మెన్స్​తో పిచ్చెక్కిస్తుంది!-2024 hyundai ioniq 5 n unique key features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Ioniq 5 N : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎన్​.. పర్​ఫార్మెన్స్​తో పిచ్చెక్కిస్తుంది!

Hyundai Ioniq 5 N : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎన్​.. పర్​ఫార్మెన్స్​తో పిచ్చెక్కిస్తుంది!

Sharath Chitturi HT Telugu
Jul 17, 2023 06:49 AM IST

Hyundai Ioniq 5 N : పర్​ఫార్మెన్స్​ ఓరియెంటెడ్​ ఐయానిక్​ 5 ఎన్​ను హ్యుందాయ్​ రివీల్​ చేసింది. పూర్తి విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎన్​.. పర్​ఫార్మెన్స్​తో పిచ్చెక్కిస్తుంది!
హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎన్​.. పర్​ఫార్మెన్స్​తో పిచ్చెక్కిస్తుంది! (Hyundai)

Hyundai Ioniq 5 N : ఐయానిక్​ 5 సక్సెస్​ తర్వాత.. ఐయానిక్​ 5 ఎన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ను రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​. ఇంగ్లాండ్​లో జరిగిన గుడ్​వుడ్​ ఫెస్టివల్​ ఆఫ్​ స్పీడ్​లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. పర్​ఫార్మెన్స్​ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కారు ఇది. ఫీచర్స్​ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఐయానిక్​ 5 ఎన్ డిజైన్​​..

2021లో హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ బయటకొచ్చింది. దీనికి.. వరల్డ్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ 2022 టైటిల్​ దక్కింది. ఫ్యూచరిస్టిక్​ డిజైన్​, పవర్​ఫుల్​ ఇంజిన్​లు ఉండటం ఓ కారణం. ఇక ఇప్పుడు పర్​ఫార్మెన్స్​​పైనే దృష్టిపెట్టి రూపొందించిన ఐయానిక్​ 5 ఎన్​పైనా అంచనాలు పెరిగాయి.

ఈ ఈవీలో క్లామ్​షెల్​ హుడ్​, స్లీక్​ బ్లాక్​ గ్రిల్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, స్క్వేర్డ్​ ఔట్​ డీఆర్​ఎల్స్​, రివైజ్​డ్​ బంపర్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, 21 ఇంచ్​ బ్లాక్​డ్​ ఔట్​ ఫోర్డ్​డ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి. రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా లభిస్తున్నాయి.

కొత్త కారులో క్రేజీ టెక్నాలజీ..!

ఈ కొత్త కారులో డ్రైవర్​ ఎంగేజ్​మెంట్​ను పెంచేందుకు ఆర్​-ఎండీపీఎస్​ (రాక్​ మౌంటెడ్​ మోటార్​ డ్రివెన్​ పవర్​ స్టీరింగ్​) సిస్టెమ్​ను తీసుకొచ్చింది హ్యుందాయ్​ సంస్థ. దీనిలో స్టీరింగ్​ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎన్​ పెడల్​ ద్వారా థ్రాటిల్​ సెన్సిటివిటీ కంట్రోల్​ అవుతుంది. రీజెనరేటివ్​ బ్రేకింగ్​కి ఉపయోగపడుతుంది. 2024 ఐయానిక్​ 5 ఎన్​లో ఎన్​ ఈ-షిఫ్ట్​, ఎన్​ యాక్టివ్​ సౌండ్​+ వంటి ఫంక్షన్స్​ ఉన్నాయి.

ఇదీ చూడండి:- Hyundai CRETA EV : టెస్ట్​ రన్​ దశలో హ్యుందాయ్​ క్రేటా ‘ఈవీ’.. లాంచ్​ ఎప్పుడు?

ఇక ఇందులో డ్యూయెల్​ ఎలక్ట్రిక్​ మోటార్​ సెటప్​ ఉంటుంది. 84కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ దీని సొంతం. ఈ మోటార్​ 641 హెచ్​ప పవర్​ను జనరేట్​ చేసతుంది.

ఈ మోడల్​ లాంచ్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇదిగో..

ఇక ఇండియా మార్కెట్​ విషయానికొస్తే.. ఎక్స్​టర్​ మైక్రో ఎస్​యూవీని ఇటీవలే లాంచ్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. నేటి తరం యువతను ఆకర్షించే విధంగా ఈ ఎక్స్​టర్​ను డిజైన్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. ఫ్రెంట్​లో హెచ్​ షేప్​లో ఉన్న డీఆర్​ఎల్స్​ అట్రాక్టివ్​గా ఉన్నాయి. ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, గ్రిల్​ కూడా స్టైలిష్​గా ఉన్నాయి. డైమెండ్​ కట్​ అలాయ్​ వీల్స్​ వస్తుండటం మరో హైలైట్​. హెచ్​ షేప్​లో ఎల్​ఈడీ టెయిల్​ లైట్స్​ సైతం అట్రాక్టివ్​గా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం