Hyundai Exter launch : హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ లాంచ్.. ధర రూ. 6లక్షల కన్నా తక్కువే!
Hyundai Exter launch : హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ ఇండియాలో లాంచ్ అయ్యింది. ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Hyundai Exter launch : 2023 మచ్ అవైటెడ్ ఎస్‌యూవీల్లో ఒకటైన హ్యుందాయ్ ఎక్స్టర్.. తాజాగా ఇండియాలో అధికారికంగా లాంచ్ అయ్యింది. సంస్థ నుంచి వస్తున్నఅతి చౌకైన ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ వెహికిల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎస్యూవీ- లుక్స్..
నేటి తరం యువతను ఆకర్షించే విధంగా ఈ ఎక్స్టర్ను డిజైన్ చేసింది హ్యుందాయ్ సంస్థ. ఫ్రెంట్లో హెచ్ షేప్‌లో ఉన్న డీఆర్ఎల్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్ కూడా స్టైలిష్‌గా ఉన్నాయి. డైమెండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తుండటం మరో హైలైట్. హెచ్ షేప్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ సైతం అట్రాక్టివ్‌గా ఉన్నాయి.
హ్యుందాయ్ కొత్త వెహికిల్ పొడవు 3,815ఎంఎం. వెడల్పు 1,710ఎంఎం. ఎత్తు 1,631ఎంఎం. వీల్ బేస్ వచ్చేసి 2,450ఎంఎం. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 37లీటర్లు.
ఆల్ న్యూ రేంజర్ ఖాకి, కాస్మిక్ బ్లూ షేడ్స్‌తో పాటు వైట్ విత్ బ్లాక్ రూఫ్, స్టేరీ నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, కాస్మిక్ బ్లూ విత్ బ్లాక్ రూఫ్ కలర్స్‌లో ఈ ఎక్స్టర్ అందుబాటులో ఉండనుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఫీచర్స్- ఇంజిన్ ఆప్షన్స్..
Hyundai Exter India : ఈ 5 సీటర్ మైక్రో ఎస్యూవీ కేబిన్‌లో సెమీ లెథరేట్ అప్‌హోలిస్ట్రీ, ఎక్స్టర్ లెటర్స్ ఉండే హెడ్‌రెస్ట్‌లు, 3 స్పోక్ మల్టీపంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తున్నాయి. డాష్కామ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ ఈ వెహికిల్‌లో వస్తున్నాయి. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాయిస్ అసిస్ట్‌తో ఈ ఫీచర్ పనిచేస్తుండటం హైలైట్! ఈఎక్స్, ఈఎక్స్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వంటి వేరియంట్స్‌లో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉండనుంది.
ఇదీ చూడండి:- Hyundai Exter SUV : హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
ఈ వాహనంలో ఈ20 ఫ్యూయెల్ రెడీ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 81.86 బీహెచ్పీ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ వేరియంట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 68 బీహెచ్పీ పవర్‌ను, 95.2 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ పెట్రోల్- మేన్యువల్ వేరియంట్ 19.4కేఎంపీఎల్ మైలేజ్‌ను, ఏఎంటీ వేరియంట్ 19.2కేఎంపీఎల్ మైలేజ్‌ను ఇస్తుందని సంస్థ చెబుతోంది. సీఎన్జీ వేరియంట్లో అది 27.1కేఎంపీకేగా ఉందని వెల్లడించింది.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే ఈ హ్యుందాయ్ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి వస్తున్నాయి.
కొత్త ఎస్యూవీ ధర ఎంత..?
Hyundai Exter price : ఈ ఎస్‌యూవీలో ఎక్స్‌షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్యూవీ. ఈ ప్రైజ్ పాయింట్లో ఈ ఎస్యూవీ.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న టాటా పంచ్, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ ఖైగర్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుంది.
సంబంధిత కథనం