Hyundai Grand i10 Nios Corporate: హ్యుందాయ్ నుంచి లేటెస్ట్ గా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ లాంచ్; అందుబాటు ధరలోనే..
11 April 2024, 17:56 IST
- Hyundai Grand i10 Nios Corporate edition: హ్యుందాయ్ లేటెస్ట్ గా గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) కార్పొరేట్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, సీఎన్జీ వర్షన్లలో లభిస్తుంది. కార్పొరేట్ ఎడిషన్ మాత్రం కేవలం పెట్రోల్ వర్షన్ లోనే లభిస్తుంది.
గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ లైనప్ లో కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. కార్పొరేట్ (Hyundai Grand i10 Nios Corporate) గా పిలిచే దీని ధర మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే, రూ.6.93 లక్షలు కాగా, ఏఎంటీ గేర్ బాక్స్ తో రూ.7.58 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరలు ఇంట్రడక్టరీ, అలాగే, ఎక్స్-షోరూమ్ ధరలు అన్న విషయం గమనించాలి. ఈ మోడల్స్ పై హ్యుందాయ్ మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు ఏడు సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీని అందిస్తోంది.
లేటెస్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఈ లేటెస్ట్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios Corporate) లో హ్యుందాయ్ 17.14 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అందిస్తోంది. ఇందులో యుఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీతో నాలుగు స్పీకర్లు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ తో ఉన్న స్టీల్ వీల్స్, కొత్త అమెజాన్ గ్రే కలర్ ఉన్నాయి. టెయిల్ గేట్ పై 'కార్పొరేట్' చిహ్నం ఉంటుది. అమెజాన్ గ్రేతో పాటు, అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టీల్ బ్లూ, ఫియరీ రెడ్, స్పార్క్ గ్రీన్ రంగులలో ఈ లేటెస్ట్ గ్రాండ్ ఐ10 నియోస్ లభిస్తుంది.
ఆకర్షణీయమైన ఇంటీరియర్స్
పియానో బ్లాక్ ఫినిష్ తో ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఓఆర్వీఎమ్ లు, డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ లోనే ఉంటాయి. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ తో పాటు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ను ఇందులో పొందుపర్చారు. ఇంటీరియర్ లో డ్యూయల్ టోన్ గ్రే థీమ్, డ్రైవర్ సీటు హైట్ అడ్జస్ట్మెంట్, ఫుట్ వెల్ లైటింగ్, ఫ్రంట్ రూమ్ ల్యాంప్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా డ్రైవర్ సౌలభ్యం కోసం ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అదనంగా, ఎలక్ట్రికల్లీ ఎడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్రైవర్ విండో కోసం ఆటో అప్-డౌన్, రియర్ ఏసీ వెంట్స్, ఫాస్ట్ యూఎస్బీ టైప్ సి ఛార్జర్, ప్యాసింజర్ వానిటీ మిర్రర్, రియర్ పవర్ అవుట్లెట్ తదితర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్: సేఫ్టీ ఫీచర్స్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ (Hyundai Grand i10 Nios Corporate) ఎడిషన్ లో సేఫ్టీ కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్స్, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, ఏబీఎస్ విత్ ఈబీడీ, సెంట్రల్ లాకింగ్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్ లాక్ మొదలైనవి ఉన్నాయి. గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 82 బీహెచ్పీ పవర్, 112ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 4-స్పీడ్ ఏఎమ్టీ యూనిట్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.