తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter : 'ఎక్స్​టర్'​ క్రేజ్​ మామూలుగా లేదుగా! అప్పుడే 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​!

Hyundai Exter : 'ఎక్స్​టర్'​ క్రేజ్​ మామూలుగా లేదుగా! అప్పుడే 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​!

Sharath Chitturi HT Telugu

25 July 2023, 12:47 IST

google News
    • Hyundai Exter waiting period : హ్యుందాయ్​ ఎక్స్​టర్​లోని కొన్ని వేరియంట్స్​కు 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​!
హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​! (HT Auto/Sabyasachi Dasgupta)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​!

Hyundai Exter waiting period : హ్యుందాయ్​ ఇండియా పంట పండింది! 'ఎక్స్​టర్​' ఎస్​యూవీతో ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కొత్త మోడల్​కు ఎంత డిమాండ్​ ఉందో చెప్పే వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ వెహికిల్​ లాంచ్​ అయ్యి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే వెయిటింగ్​ పీరియడ్​ భారీగా పెరిగిపోయింది! కొన్ని వేరియంట్స్​కు ఏకంగా 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకొన్నింటి డెలివరీకి కనీసం 5-6 నెలల టైమ్​ పట్టేడట్టు ఉంది.

వావ్​.. వాట్​ ఏ క్రేజ్​..!

హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఈఎక్స్​, ఈఎక్స్​ (ఓ), ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​. వీటిల్లో ఈఎక్స్​, ఈఎక్స్​(ఓ) వేరియంట్లకు 1 ఇయర్​ వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ఇతర వేరియంట్లన్నింటికీ 5-6 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది.

దేశంలో లభిస్తున్న అతి చౌకైన మైక్రో ఎస్​యూవీల్లో ఈ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఒకటి. తక్కువ ధరకే సరికొత్త ఫీచర్స్​ లభిస్తుండటంతో కస్టమర్లలో ఈ వెహికిల్​పై ఆసక్తి పెరిగింది. ఇక అట్రాక్టివ్​ డిజైన్​ ఉండటంతో యువత కూడా ఈ వాహనంవైపు మొగ్గుచూపుతోంది. వాస్తవానికి యువతను దృష్టిలో పెట్టుకునే ఈ మోడల్​ను రూపొందించింది హ్యుందాయ్​.

Hyundai Exter on road price in Hyderabad : హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

క్రేటా, అల్కజార్​, వెన్యూ వంటి మోడల్స్​తో హ్యుందాయ్​ ఇప్పటికే ఎస్​యూవీ సెగ్మెంట్​లో దూసుకెళుతోంది. ఇక ఎక్స్​టర్​ కూడా తోడవ్వడంతో సంస్థ లాభాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ కొత్త మోడల్​.. టాటా పంచ్​, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, నిస్సాన్​ మాగ్నైట్​​తో పాటు మారుతీ సుజుకీ ఇగ్నిస్​, రెనాల్ట్​ ఖైగర్​ వంటి మోడల్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు- వాటి మైలేజ్​ (కేఎంపీఎల్​​)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఈఎక్స్​- 19.4

ఎక్స్​టర్​ ఈఎక్స్ (ఓ) - 19.4

ఎక్స్​టర్​ ఎస్​ 1.2 ఎంటీ- రూ.19.4

ఎక్స్​టర్​ ఎస్​ (ఓ) 1.2 ఎంటీ- 19.4

ఎక్స్​టర్​ ఎస్​ 1.2 ఏఎంటీ- 19.2

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ 1.2 ఎంటీ- 19.4

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ 1.2 ఎంటీ డ్యూయెల్​ టోన్​- 19.4

Hyundai Exter variant wise mileage : ఎక్స్​టర్​ ఎస్​ 1.2 సీఎన్​జీ ఎంటీ- 27.1 కేఎం/కేజీ

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) 1.2 ఎంటీ- 19.4

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ 1.2 ఏఎంటీ- 19.2

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ 1.2 ఏఎంటీ డ్యూయెల్​ టోన్​- 19.2

ఎక్స్​టర్​ ఎక్స్​ఎక్స్​ 1.2 సీఎన్​జీ ఎంటీ- 27.1 కేఎం/కేజీ

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ 1.2 ఎంటీ- 19.4

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) 1.2 ఏఎంటీ- 19.4

Hyundai Exter mileage : ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ 1.2 ఎంటీ డ్యూయెల్​ టోన్​- 19.4

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ 1.2 ఏఎంటీ- 19.2

ఎక్స్​టర్​ ఎస్​ఎక్స్​ (ఓ) కెనెక్ట్​ 1.2 ఏఎంటీ డ్యూయెల్​ టోన్​- 19.2

తదుపరి వ్యాసం