Hyundai EXTER : హ్యుందాయ్ ఎక్స్టర్ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్!
20 November 2023, 14:50 IST
- Hyundai EXTER : భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ హవా కొనసాగుతోంది. లాంచ్ అయిన నాలుగు నెలలకే.. 1లక్ష బుకింగ్స్ మైలురాయిని తాకింది ఈ ఎస్యూవీ.
1 లక్ష బుకింగ్స్‌తో సరికొత్త మైలురాయిని తాకిన హ్యుందాయ్ ఎక్స్టర్!
Hyundai EXTER milestone : హ్యుందాయ్ ఎక్స్టర్కు బీభత్సమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్యూవీ.. ఓ కొత్త మైలురాయిని తాకింది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే.. 1లక్ష బుకింగ్స్‌ని సంపాదించుకుంది ఈ ఎస్యూవీ! బడ్జెట్ ఫ్రెండ్లీ ధరకే క్రేజీ ఫీచర్స్ వస్తుండటం, డిజైన్ కూడా హిట్ అవ్వడంతో.. భారతీయులు ఈ మోడల్‌పై విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు.
హ్యుందాయ్ ఎక్స్టర్ విశేషాలు..
ఇండియాలో.. 2023 జులైలో లాంచ్ అయ్యింది ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ. ఈ వెహికిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.5లక్షల మధ్యలో ఉంటుంది. ఈ మోడల్లో 7 వేరియంట్లు ఉన్నాయి. అంటే.. హ్యాచ్‌బ్యాక్ ధరకే దాదపు అన్ని ఫీచర్స్‌తో కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆఫర్ చేస్తోంది హ్యుందాయ్. ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
Hyundai EXTER on road price Hyderabad : మరీ ముఖ్యంగా.. హ్యుందాయ్ ఎక్స్టర్ హై- ఎండ్ మోడల్స్‌లో క్రేజీ ఫీచర్స్ వస్తున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయెల్ వ్యూ- డాష్ కెమెరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జింగ్ వంటివి ఈ కారు సొంతం.
ఈ ఎస్‌యూవీలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 82 హెచ్‌పీ పవర్‌ని, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ ఎక్స్టర్ మైలేజ్ 19.2 కేఎంపీఎల్గా ఉండటం విశేషం.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Hyundai EXTER price Hyderabad : ఈ 5 సీటర్ మైక్రో ఎస్యూవీ కేబిన్‌లో సెమీ లెథరేట్ అప్‌హోలిస్ట్రీ, ఎక్స్టర్ లెటర్స్ ఉండే హెడ్‌రెస్ట్‌లు, 3 స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తున్నాయి. డాష్కామ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ ఈ వెహికిల్‌లో వస్తున్నాయి. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాయిస్ అసిస్ట్‌తో ఈ ఫీచర్ పనిచేస్తుండటం హైలైట్!
డిమాండ్‌కు తగ్గట్టే.. ఎక్స్టర్ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది! ఎస్ వేరియంట్‌తో పాటు ఎస్ఎక్స్ సీఎన్జీ మోడల్‌కు 5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) ఏఎంటీ, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ ఏంటీ వేరియంట్ల డెలివరీలకు గరిష్ఠంగా 8 నెలల సమయం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 1 ఏడాదిగా కూడా ఉంది.
Hyundai EXTER on road price : ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా పంచ్ ఎస్‌యూవీకి ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ గట్టిపోటీనిస్తోంది.