Hyundai Creta vs Creta N Line: హ్యుందాయ్ క్రెటా స్టాండర్డ్ వర్సెస్ క్రెటా ఎన్ లైన్.. ఏ ఎస్ యూ వీ కొనాలంటే..?
30 March 2024, 19:48 IST
Hyundai Creta vs Creta N Line: హ్యుందాయ్ తన ఫ్లాగ్ షిప్, బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన క్రెటాకు స్పోర్టియర్ వెర్షన్ గా క్రెటా ఎన్ లైన్ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధరల్లో పెద్దగా తేడా లేకపోవడంతో, ఎస్ యూవీ స్టాండర్డ్, ఎన్ లైన్ వెర్షన్ల మధ్య ఏది ఎంపిక చేసుకోవాలనేది కఠినమైన ఎంపికగా మారింది.
హ్యుందాయ్ క్రెటా స్టాండర్డ్ వర్సెస్ క్రెటా ఎన్ లైన్
హ్యుందాయ్ క్రెటా ఎస్ యూవీ (Hyundai Creta SUV) రెండు నెలల తేడాతో మొదట స్టాండర్డ్ వర్షన్ ను, ఆ తరువాత ఎన్ లైన్ వెర్షన్ ను విడుదల చేసింది. స్టాండర్డ్ క్రెటా కు స్పోర్టియర్ వెర్షన్ గా క్రెటా ఎన్ లైన్ ఎస్ యూవీ ని భావిస్తున్నారు. క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) స్టాండర్డ్ వర్షన్ తో పోలిస్తే, స్వల్ప మార్పులతో వస్తుంది. ఏదేమైనా, ధరలో చాలా తక్కువ వ్యత్యాసం ఉండడంతో, క్రెటా లో స్టాండర్డ్ (Hyundai Creta SUV) వర్షన్ కు వెళ్లాలా? లేక ఎన్ లైన్ కొనుగోలు చేయాలా? అన్నది వినియోగదారులకు కఠినమైన ఎంపికగా మారింది.
ధర
మినీ, లేదా కాంపాక్ట్ ఎస్ యూ వీలను మినహాయిస్తే, ఎస్ యూ వీలను కొనడం ఇప్పుడు ఖరీదైన వ్యవహారం. ఏ కంపెనీ కూడా తమ మోడళ్లను రూ .10 లక్షల లోపు ఆఫర్ చేయడం లేదు. అత్యంత ప్రాథమిక ఎంట్రీ లెవల్ వెర్షన్లపై ఆసక్తి లేని వారి కోసం ఫీచర్ లోడెడ్ వేరియంట్లను అందిస్తున్నారు. వీటి ధర రూ .15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటోంది. క్రెటా స్టాండర్డ్, క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) వెర్షన్లు రెండూ ఇదే బ్రాకెట్ లో ఉన్నాయి. క్రెటా ఎన్ లైన్ ధర రూ .16.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇదే వేరియంట్ క్రెటా స్టాండర్డ్ (Hyundai Creta SUV) వెర్షన్ ధర రూ.15.27 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. రెండు వెర్షన్ల టాప్-ఎండ్ వేరియంట్ల ధరల మధ్య వ్యత్యాసం కేవలం రూ .15,000 మాత్రమే ఉంది. ఎన్ లైన్ (Hyundai Creta N Line) టాప్ ఎండ్ వెర్షన్ ధర రూ .20.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
డిజైన్
కొన్ని మార్పులు మినహా, క్రెటా ఎన్ లైన్ దాని డిజైన్ పరంగా ప్రామాణిక క్రెటా ఎస్ యూవీతో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు, క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) గ్రిల్, బంపర్ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎన్ లైన్ వర్షన్ స్పోర్టియర్ లుక్ ను అందించడానికి కొంత రీడిజైన్ చేయబడింది. అల్లాయ్ వీల్ సైజులు స్టాండర్డ్ వెర్షన్ కన్నా ఎన్ లైన్ లో పెద్దవి వస్తాయి. ఎన్ లైన్ క్రెటా లో 18 అంగుళాల టైర్లు ప్రామాణికంగా వస్తాయి. వెనుక భాగంలో, క్రెటా ఎన్ లైన్ ట్విన్-టిప్ ఎగ్జాస్ట్, రీ డిజైన్ చేయబడిన బంపర్ ఉంటుంది. బాహ్య రంగు పరంగా, రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం.. ఎన్ లైన్ లో కారు చుట్టూ ఉండే ఎరుపు యాక్సెంట్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్లు. స్పోర్టియర్ క్రెటా ఎన్ లైన్ వెర్షన్ ప్రత్యేకమైన మ్యాట్ గ్రే కలర్ స్కీమ్ తో లభిస్తుంది.
ఫీచర్లు
క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line), స్టాండర్డ్ క్రెటా (Hyundai Creta SUV) ల మధ్య ఫీచర్స్ పరంగా పెద్ద తేడాలు లేవు. క్రెటా ఎన్ లైన్ క్యాబిన్ దాని ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, చుట్టూ ఎరుపు యాక్సెంట్ తో కొంత స్పోర్టియర్ గా ఉంటుంది. స్టీరింగ్ వీల్, గేర్ లివర్ నుండి సీట్ల హెడ్ రెస్ట్ ల వరకు అనేక ఎన్ లైన్ బ్యాడ్జింగ్ లు ఉన్నాయి. స్పోర్టీ లుక్ ఇంటీరియర్ కోసం సీట్లకు భిన్నమైన ఎరుపు స్టిచెస్ ను వేశారు.
ఇంజిన్, ట్రాన్స్ మిషన్
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. స్టాండర్డ్ క్రెటాలో కూడా ఇదే ఇంజన్ ఉంటుంది. అయితే, క్రెటా ఎన్ లైన్ మాత్రమే ఈ ఇంజిన్ రెండు ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ తో వస్తుంది. అవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్. స్టాండర్డ్ క్రెటా, ఎన్ లైన్ క్రెటా ల పవర్ అవుట్ పుట్ ఒకేలా ఉన్నప్పటికీ, సస్పెన్షన్, స్టీరింగ్ వీల్ లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇవి ఎన్ లైన్ కు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.