Hyundai Ioniq 5 launch : హ్యుందాయ్ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్ 5 లాంచ్ ఫిక్స్!
11 November 2022, 10:58 IST
- Hyundai Ioniq 5 launch in India : దేశంలో తమ సంస్థ నుంచి రెండో ఈవీగా ఐయానిక్ 5ని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది హ్యుందాయ్ మోటార్. ఆ వివరాలు..
హ్యుందాయ్ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్ 5 లాంచ్ ఫిక్స్!
Hyundai Ioniq 5 launch in India : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం ఊపందుకుంది. ఈవీలను లాంచ్ చేసేందుకు దేశంలోని అన్ని ఆటో సంస్థలు పోటీపడుతున్నాయి. హ్యుందాయ్ మోటార్ కూడా ఇందుకోసం సన్నద్ధమైంది. ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసిన హ్యూందాయ్.. ఇప్పుడు మరో ఈవీని భారత రోడ్డు మీదకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. గ్లోబల్ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఐయానిక్ 5ని ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.
రెండో ఈవీ..
ఇండియాలో.. కోనా ఎలక్ట్రిక్ పేరుతో సంస్థ నుంచి తొలి ఈవీని లాంచ్ చేసింది హ్యుందాయ్ మోటార్. ఇక రెండో ఈవీగా ఐయానిక్ 5ని దింపేందుకు ప్రణాళికలు రచించింది. ఈ హ్యుందాయ్ ఐయనిక్ 5 ఈవీని ఈ-జీఎంపీ(ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్) ప్లాట్‌ఫామ్‌పై రూపొందించనుంది. ఈ వాహనం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండగా.. కియా సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు ఈవీ6కి గట్టి పోటీనిస్తోంది.
Hyundai Ioniq 5 launch date : అయితే.. ఇండియాలో హ్యుందాయ్ ఐయానిక్ 5 లాంచ్ ఎప్పుడుంటుంది? అనే విషయంపై సంస్థ స్పష్టతనివ్వలేదు. కాగా.. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో ఆటో ఎక్స్పో జరగనుంది. ఇందులో ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ.. ప్రదర్శనకు ఉండనుంది. ఈ నేపథ్యంలో.. ఇండియాలో ఈ కారు త్వరలో లాంచ్ అవుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
"ఇండియాలో మా ఈవీ ప్రయాణం 2019లో మొదలైంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేశాము. మొబిలిటీ, ఇన్నోవేటివ్ వంటి అంశాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. ఇక ఈ-జీఎంపీతో అది సాధ్యపడుతోంది. హ్యుందాయ్ ఐయానిక్ 5ని ఇండియాలో లాంచ్ చేస్తున్నాము," అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఈఓ, ఎండీ ఉన్సో కిమ్ తెలిపారు.
Hyundai Staria వాహనానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2028 నాటికి ఇండియాలో 6 ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తామని హ్యుందాయ్ మోటార్ ఇప్పటికే ప్రకటించింది. రానున్న మోడల్స్‌లో ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు కూడా ఉంటుందని తమ అధికారిక వెబ్సైట్లో ఇటీవలే పొందుపరిచింది హ్యుందాయ్.
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఫీచర్స్..
Hyundai Ioniq 5 price in India : హ్యుందాయ్ ఐయానిక్ 5కి ఫ్యూచరిస్టిక్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్ ఉంటుంది. స్క్వేర్ డీఆర్ఎల్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 20 ఇంచ్ ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ అలాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పిక్సలేటెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటీనా వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో.. 'ది మోస్ట్ హ్యాండ్సమ్' కారుగా ఇది గుర్తింపు పొందింది.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. హ్యుందాయ్ ఐయానిక్ 5లో డాష్‌బోర్డు మీద ఓ భారీ కన్సోల్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉంటుంది. టూ స్పోక్ ఫ్లాట్ బటన్ స్టీరింగ్ వీల్, సెకెండ్ రోకు అడ్జస్టెబుల్ సీటింగ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్ ఉంటాయి.
Hyundai Motors : అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ ప్రకారం.. హ్యుందాయ్ ఐయానిక్ 5లో 58కేడబ్ల్యూహెచ్, 72.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ లభిస్తాయి. ఈ రెండు ఆర్డబ్ల్యూడీ లదా ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్స్‌తో ఉంటాయి. ఇండియా మార్కెట్లో ఏ ప్యాక్‌ను వినియోగిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.