1 lakh discounts on Hyundai cars: ఈ కార్లపై లక్ష వరకు డిస్కౌంట్; డోంట్ మిస్
discounts on Hyundai cars: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండై(Hyundai) తమ కార్ల శ్రేణిలోని పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బోనస్, ఎక్స్ చేంజ్ ఆఫర్లను ప్రకటించింది.
discounts on Hyundai cars: కారు కొనే ఆలోచనలో ఉన్నారా? దసరా, దీపావళి ఆఫర్లు ముగిసాయని బాధ పడ్తున్నారా? మీ కోసమే ఈ న్యూస్. భారత్ లో విస్తృత శ్రేణిలో కార్లను ఉత్పత్తి చేస్తున్న హ్యుండై(Hyundai) కంపెనీ పలు కార్ బ్రాండ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
discounts on Hyundai cars: ఈ నెలాఖరు వరకు..
ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. Hyundai ప్రకటించిన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. కంపెనీ కార్ల శ్రేణిలోని కోనా ఎలక్ట్రిక్(Kona Electric), గ్రాండ్ ఐ10 నియోస్(Grand i10 Nios), ఆరా(Aura), ఐ20(i20) లపై Hyundai డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
discounts on Hyundai cars: కోనా ఎలక్ట్రిక్(Kona Electric)
భారత్ మార్కెట్లోకి హ్యుండై సంస్థ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కార్ ఇది. 2019లో ఇది లాంచ్ అయింది. ఈ కారుపై కస్టమర్లు లక్ష రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. హై రేంజ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు. ఇందులోని బ్యాటరీని ఒకసారి ఫుల్ గా చార్జ్ చేస్తే 452 కిమీల దూరం ప్రయాణించవచ్చు.
discounts on Hyundai cars: గ్రాండ్ ఐ 10 నియోస్(Grand i10 Nios)
ఈ కార్ పై హ్యుండై సంస్థ రూ.48 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. 1.0 లీటర్ టర్బో ఇంజిన్ వేరియంట్ పై రూ. 35 వేలు, సీఎన్ జీ వేరియంట్ పై రూ. 25 వేలు, 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ పై రూ. 15 వేలు డిస్కౌంట్ ను సంస్థ ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎక్సచేంజ్ బోనస్ గా రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ గా రూ. 3 వేలు కూడా Hyundai ఆఫర్ చేస్తోంది.
discounts on Hyundai cars: ఆరా(Aura)
హ్యుండై నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్స్ లో ఆరా ఒకటి. ఈ మోడల్ లోని పెట్రోల్ వేరియంట్ పై రూ. 5 వేలు, సీఎన్ జీ వేరియంట్ పై రూ. 25 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఈ మోడళ్లపై కూడా ఎక్సచేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది.
discounts on Hyundai cars: ఐ 20 (i20)
హ్యుండై పాపులర్ కార్లలో ఐ 20 తొలి స్థానంలో ఉంటుంది. ఈ కారుపై కస్టమర్లు రూ. 10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10 వేల ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. ఐ 20 లోని మాగ్నా, స్పోర్ట్స్ మోడళ్లపై ఈ ఆఫర్ ఉంది. ఇకపై ప్రధానంగా ఎలక్ట్రిక్, ఎస్ యూవీ, లగ్జరీ మోడళ్లపై దృష్టి పెట్టనున్నట్లు హ్యుండై ప్రకటించింది.