Hyundai Ai3 CUV mini SUV: హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ.. టాటా పంచ్‌కు పోటీగా ఎంట్రీ
Hyundai Ai3 CUV mini SUV: హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ టాటా పంచ్, నిసాన్ మాగ్నైట్ కార్లకు పోటీగా వస్తోంది.
Hyundai Ai3 CUV mini SUV: హ్యుందాయ్ మోటార్స్ కొత్తగా ఏఐ3 సీయూవీతో తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేయనుంది. ఏఐ3 సీయూవీ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా పరిచయం చేయనుంది. దీనిని నూతన సంవత్సరంలో లాంఛ్ చేయనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కార్ ఆవిష్కరణపై హ్యుందాయ్ మోటార్స్ 2017 నుంచి పని చేస్తోంది. టాటా పంచ్‌కు పోటీగా ఇది భారతీయ మార్కెట్లలోకి రానుంది.
Engine and transmission: హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ ఇంజిన్
హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోంది. హ్యుందాయ్ ఐ10 ఎన్ఐఓఎస్, ఆరా కార్లలో కూడా ఇదే ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్ పవర్‌ను, 114 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ల ట్రాన్స్‌మిషన్, అలాగే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) సౌలభ్యం కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఏఐ3 సీయూవీ పేరుతో వస్తున్న ఈ మినీ ఎస్‌యూవీ లాంచ్ అయిన తరువాత ఏడాదికి కనీసం 50 వేల యూనిట్లు అమ్మాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Ai3 CUV vs Tata Punch: ఏఐ3 సీయూవీ వర్సెస్ టాటా పంచ్
గ్రాండ్ ఐ10 ఎన్ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చెందుతున్న ఏఐ3 సీయూవీ 3,595 ఎంఎం పొడవు, 3,995 ఎంఎం వెడల్పు ఉంటుంది. టాటా పంచ్ పొడవు 3,827 ఎంఎం ఉంటుంది. ఏఐ3 సీయూవీ రెనో కైగర్, నిసాన్ మాగ్నైట్ కార్లకు కూడా సవాలు విసరనుంది.